తేలు కరిస్తే వెంటనే ఇలా చేయండి.. లేకుంటే ప్రమాదమే..!

ప్రతి సంవత్సరం దాదాపు 3,000 మంది తేలు కాటుతో చనిపోతున్నారు. ఇందులో చిన్నపిల్లలే 80 శాతం మంది ఉంటారు. తేలు కాటు అంటే చిన్న విషయం కాదు. ఇది శరీరంపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తేలు కుట్టినప్పుడు వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

తేలు కరిస్తే వెంటనే ఇలా చేయండి.. లేకుంటే ప్రమాదమే..!
Scorpion

Updated on: Jun 02, 2025 | 6:08 PM

తేలు తనకు ప్రమాదం అనిపించినప్పుడు కుట్టి విషాన్ని వదిలేస్తుంది. ఇది చిన్న జంతువులకు ప్రాణాలను తీసేంత ప్రమాదకరం. మనుషులకు మాత్రం తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కుట్టిన చోట తిమ్మిర్లు, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ నొప్పి రెండు రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది.

తేలు మనుషులపై కావాలని దాడి చేయదు. దానికి ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే కుడుతుంది. తేలు ఎక్కువగా బూట్ల లోపల, మంచం కింద, మూసివున్న ప్రదేశాల్లో దాక్కుంటుంది. మనం తెలియకుండా వాటిని తాకినప్పుడు అవి కుడుతాయి.

తేలు కనిపించే ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలు పెట్టే ముందు చుట్టూ చూడాలి. తేలు కనిపిస్తే చేతులతో తాకకూడదు. చేతి
గ్లౌజ్ లు ధరించడం మంచిది. రాత్రిళ్లు పడుకునే ముందు మంచం కింద కూడా చూడాలి. చిన్న పొరపాటు వల్ల కూడా ప్రమాదం జరగవచ్చు.

తేలు కాటుకు గురైన వ్యక్తికి ఒక్కసారిగా శరీరంలో మార్పులు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తల తిరుగుతుంది, ఛాతీ నొప్పి కూడా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది మరింత ప్రమాదకరం. కండరాల నొప్పులు, నిద్రలేమి, కళ్ళు అదురడం, ఆందోళన, చెమటలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

తేలు కుట్టిన వెంటనే నొప్పి తగ్గించడానికి ఆ ప్రాంతాన్ని బట్టతో కట్టాలి. అంతేకాదు భయపడకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. రక్షణ కోసం చేతి తొడుగులు, బూట్లు వేసుకోవడం చాలా ముఖ్యం.

తేలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. పొదల మధ్య, రాళ్ళ కింద, చెట్ల దగ్గర రాత్రిపూట తిరగకూడదు. ఇంట్లో కూడా తేలు దూరకుండా శుభ్రంగా ఉంచాలి. పాత వస్తువుల దగ్గర తాకేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)