Aadhaar With Mobile Number: ఆధార్‌కు ఫోన్ నెంబ‌ర్ లింక్ చేయ‌లేదా..? ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..

|

Jun 01, 2021 | 1:25 PM

Aadhaar With Mobile Number: ప్ర‌స్తుతం ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. రైలు టికెట్ నుంచి ఫ్లైట్ టికెట్ వ‌ర‌కు. సిమ్ కార్డు నుంచి తాజాగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేంత వ‌ర‌కు...

Aadhaar With Mobile Number: ఆధార్‌కు ఫోన్ నెంబ‌ర్ లింక్ చేయ‌లేదా..? ఎలా చేసుకోవాలో తెలుసుకోండి..
Aadhar Card Link Mobile
Follow us on

Aadhaar With Mobile Number: ప్ర‌స్తుతం ఏ చిన్న పనికైనా ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. రైలు టికెట్ నుంచి ఫ్లైట్ టికెట్ వ‌ర‌కు. సిమ్ కార్డు నుంచి తాజాగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకునేంత వ‌ర‌కు ఆధార్ కార్డు ప‌క్కాగా ఉండాల్సిందే. ఈ క్ర‌మంలోనే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబ‌ర్‌ను లింక్ చేసుకోవాల్సిన అవ‌సరం కూడా త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నెంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీ ఆధారంగానే ప‌నులు జ‌రుగుతున్నాయి.
అయితే కొత్త‌గా ఆధార్ తీసుకుంటున్న వారికి ఫోన్ నెంబ‌ర్ల‌ను లింక్ చేస్తున్నారు. కానీ గ‌తంలో ఆధార్ తీసుకున్న వారికి ఫోన్ నెంబ‌ర్‌లు లింక్ చేయ‌కుండానే కార్డులు జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మ‌రి ఇలాంటి కీల‌క స‌మయంలో ఆధార్ కార్డును మొబైల్ నెంబ‌ర్‌కు ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందామా..! ఈ విష‌య‌మై యూఐడీఏఐ ఫోన్ నెంబ‌ర్‌ను ఎలా లింక్ చేయాలో వీడియో రూపంలో ట్వీట్ చేశారు.

ఇందు కోసం ఏం చేయాలంటే..

* ఆధార్ కార్డు దారులు ముందుగా.. స‌మీపంలో ఉన్న ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంట‌ర్ లేదా ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లాలి.

* మీకు ద‌గ్గ‌ర‌ల్లో ఉన్న ఆధార్ ఎన్‌రోల్ మెంట్ సెంట‌ర్ల‌ను తెలుసుకోవ‌డానికి ఎమ్ఆధార్ యాప్ లేదా.. 1947 టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేసి తెలుసుకోవ‌చ్చు.

* ఆధార్ నెంబ‌ర్‌కు ఫోన్ నెంబ‌ర్‌ను లింక్ చేయ‌డానికి అదే స‌మ‌యంలో పాత నెంబ‌ర్‌ను మార్చ‌డానికి ఎలాంటి డ్యాక్యుమెంట్లు అవ‌స‌రం ఉండ‌వు.

* బ‌యోమెట్రిక్ అథెంటికేష‌న్ కోసం అభ్య‌ర్థి నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతానికి ఈ సేవ‌ల‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. కాబ‌ట్టి నేరుగా వెళ్లాల్సిందే.

* అనంత‌రం అన్ని వివ‌రాలు ఇచ్చి కేవ‌లం రూ. 50 ఫీజు అందిస్తే చాలు మొబైల్ నెంబ‌ర్‌ను ఆధార్ లింక్ చేసేస్తారు. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఆధార్‌కు మొబైల్ నెంబ‌ర్‌ను లింక్ చేసుకోవ‌చ్చు.

Also Read: Puri Jagannadh: గ‌తంలో ఎన్నడూ ఎరుగ‌ని సిట్యూవేష‌న్.. ఇస్మార్ట్ డైరెక్టర్, ఏంటి మేట‌ర్

Naya Paisa History: వినుడు వినుడీ… ఈ భారతీయ “నయా పైసా” గాథ!

Toilet For Covid Patients : కొవిడ్ రోగుల కోసం సరికొత్త టాయ్‌లెట్..! తరలించడానికి వీలుగా తయారు చేసిన నిఫ్ట్ విద్యార్థి..