ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ఆ తర్వాత రోజు నుండి యాంటీ-వాలెంటైన్ వీక్ ప్రారంభమవుతుంది. వాలెంటైన్స్ వీక్‌లో అందరూ ప్రేమను ఎంజాయ్ చేస్తారు.. కానీ, స్లాప్, బ్రేకప్, కిక్, ఫ్లర్ట్, మిస్సింగ్ డేలను యాంటీ-వాలెంటైన్‌లో జరుపుకుంటారు. తమ ప్రేమ ఇంకా తెలియజేయకుండానే విడిపోయిన వ్యక్తుల కోసం యాంటీ-వాలెంటైన్ వీక్ ప్రత్యేకమైనది. అదే ఫిబ్రవరి 20 మిస్సింగ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే నాలుగో రోజు. ఈ రోజున వ్యక్తులు తమ భావాలను దాచుకుంటూ.. తమ ప్రియమైనవారికి దూరమై ఎంతగా బాధపడుతున్నారో తెలియజేసే రోజు. ఈ రోజు జరుపుకోవడం ఉద్దేశ్యం ఏమిటంటే, తమ ప్రియమైన వారిని మిస్ అయిన లేదంటే మిస్ అయిన వ్యక్తులు వారి భావాలను ప్రేమించిన వారితో బహిరంగంగా వ్యక్తం చేయవచ్చు. అంతేకాదు.. ఈ ప్రత్యేక రోజున, వారు తమ ప్రియమైన వారికి సందేశాలు లేదా శుభాకాంక్షలు పంపడం ద్వారా కూడా తమ భావాలను వ్యక్తం చేయవచ్చు. మిస్సింగ్ డే చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
మిస్సింగ్ డే ఎందుకు జరుపుకుంటారు?..
మిస్సింగ్ డేని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం ప్రియమైన వారు మరణించినా, లేదంటే, వారి భాగస్వామి విడిచిపెట్టిన వ్యక్తులను గుర్తు చేసుకోవడమే మిస్సింగ్ డే. అంతే కాకుండా, తమ స్నేహితులు, బంధువులను తాము ఎంతగా ప్రేమిస్తున్నామో, మిస్ అవుతున్నామని చెప్పలేని వారికి కూడా ఈ రోజు ప్రత్యేకమైనది. అటువంటి పరిస్థితిలో వారు ఈ రోజున తన భావాలను వారికి తెలియజేయవచ్చు. వారి జీవితంలో వారు ఎంత ముఖ్యమైనవారో కూడా మీరు వారికి తెలియజేయవచ్చు.
మిస్సింగ్ డేని ఇలా ప్రత్యేకంగా చేయండి..
మీ భాగస్వామి మీకు దూరంగా ఉంటే, వారిని ‘మిస్ యు’ అని పిలవడానికి బదులుగా, మీరు వారికి ఒక అందమైన బహుమతిని ఇవ్వొచ్చు. అదే సమయంలో, మీ భాగస్వామితో విడిపోయినట్లయితే, వారి కోసం బాధపడటం వదిలేయండి.. వారిని సంతోషపెట్టడానికి మీరు ఖర్చు చేయబోతున్న డబ్బు, సమయం మీ కోసం ఖర్చు చేయండి. స్పాకి వెళ్లండి, సినిమా చూడండి, షాపింగ్‌కి వెళ్లండి.. మరేదైన ఏదైనా మీకు నచ్చిన, ఖరీదైన తిండి తినండి..లేదంటే, ఏదైనా కొనుగోలు చేయండి..
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..