Accreditation: జర్నలిస్టులకు శుభవార్త.. ఇకనుంచి వారికి కూడా అక్రిడిటేషన్..

|

Feb 09, 2022 | 10:52 AM

Accreditation: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు-2022ని విడుదల చేసింది. దీని కింద ఒక జర్నలిస్టు దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్, దేశ వ్యతిరేక సంబంధాలు, నైతికత, ప్రజా భద్రతకు

Accreditation: జర్నలిస్టులకు శుభవార్త.. ఇకనుంచి వారికి  కూడా అక్రిడిటేషన్..
Accreditation
Follow us on

Accreditation: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు-2022ని విడుదల చేసింది. దీని కింద ఒక జర్నలిస్టు దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్, దేశ వ్యతిరేక సంబంధాలు, నైతికత, ప్రజా భద్రతకు విరుద్ధంగా వ్యవహరించడం, కోర్టు ధిక్కారం, పరువు నష్టం లేదా నేరాన్ని ప్రోత్సహించడం విషయాలలో ద్వేషపూరితంగా ప్రవర్తిస్తే అక్రిడిటేషన్ రద్దు చేసేలా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా మొదటిసారిగా డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అక్రిడిటేషన్‌ కార్డులు పొందేందుకు అర్హులుగా ప్రకటించింది.

సాధారణంగా డిజిటల్ మీడియాలో పనిచేసేవారికి ఇప్పటివరకు అక్రడిటేషన్ ఉండేది కాదు. కానీ కేంద్రం కొత్త నిర్ణయంతో వారికి కూడా అక్రిడిటేషన్ పొందే వెసులుబాటు దొరికింది. ఈ విషయంలో కేంద్రం కొన్ని షరతులను కూడా విధించింది. వీటి ప్రకారం నడుచుకున్నవారికి మాత్రమే అక్రిడిటేషన్ మంజూరుచేస్తామని ప్రకటించింది. 2021లోని రూల్ 18 ప్రకారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అవసరమైన సమాచారాన్ని అందించాలి. నిబంధనలను ఉల్లంఘించకూడదు.

వెబ్‌సైట్‌లో కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరంగా పనిచేసి ఉండాలని సూచించింది. వెబ్‌సైట్‌కి దేశంలో రిజిస్టర్డ్ కార్యాలయం ఉండాలని పేర్కొంది. న్యూస్ పోర్టల్ ఎడిటర్ భారతీయ జాతీయుడై ఉండాలి. కరస్పాండెంట్‌లు ఢిల్లీ లేదా జాతీయ రాజధాని ప్రాంతంలో ఉండాలి. విదేశీ వార్తా మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు మాత్రం ఎలాంటి అక్రిడిటేషన్ ఉండవని పేర్కొంది.

Relationship: లైఫ్ పార్ట్‌నర్‌ని చేసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

వాలెంటైన్స్ డేకి స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.. 4GB RAMతో వచ్చే ఈ 4 ఫోన్లు సూపర్..?

Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా కెరీర్ ‘ఓవర్‌’.. శ్రీలంక సిరీస్‌కి నో ఛాన్స్‌..