Bald Head: బట్టతల ఉన్నవారికి గుడ్ న్యూస్. నెత్తి మీద ఉన్న కాస్త జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదు.. పోయిన జుట్టు మళ్లీ వస్తుంది. ఇలాంటివి చాలానే విన్నాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కూడా వినండి.. సైంటిస్టులపై నమ్మకం ఉంటే.. బిలీవ్ చేయండి. మీకు జుట్టు మొలుస్తుంది. తలపై ప్లేగ్రౌండ్స్ కాస్తా.. అడవుల్లా తయారవుతాయి. ఒక్క ట్యాబ్లెట్.. ఒకే ఒక్క ట్యాబ్లెట్.. మీ బట్టబుర్రమీద జుట్టుని మొలకెత్తించబోతోంది. అసలేంటీ మాత్ర? జట్టు ఎలా వస్తుంది? పరిశోధకులు ఏం కనిపెట్టారు? దాని గురించి వారు ఏం చెబుతున్నారు? అనేది ఈ కథనం తెలుసుకుందాం..
మీకు బట్టతల ఉందా? బట్టతల కారణంగా అన్ హ్యాపీగా ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాదు.. పోయిన జుట్టు మళ్లీ వస్తుంది. అవును.. అమెరికాకు చెందిన కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ బట్టతల ఉన్నవారికి ఆ కంపెనీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పోయిన జుట్టు తప్పకుండా వస్తుందని చెప్పింది. అయితే, ఇందుకోసం కొంత సమయం పడుతుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికాకు చెందిన కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ సైంటిస్టులు ఓ ట్యాబ్లెట్ తయారు చేశారు. దాని పేరు CTP-543. ఈ మాత్రను బట్టతల ఉన్న వారికి రోజుకు రెండు చొప్పున ఇచ్చారు. వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. ఈ మాత్రతో జుట్టు రాలడం ఆగింది. అంతేకాదు పోయిన జట్టు మళ్లీ వస్తోందని గుర్తించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న 10 మందిలో నలుగురు ఏడాది వ్యవధిలో 80శాతం కంటే ఎక్కువ జుట్టును తిరిగి పొందగలిగారని కాన్సర్ట్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తెలిపింది.
డ్రగ్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ అమెరికాలో 706 మంది బట్టతల వ్యక్తులపై ప్రయోగం చేసింది. వారు మూడు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక గ్రూపులోని వారికి 8mg ట్యాబ్లెట్ రోజుకు రెండు సార్లు ఇచ్చారు. మరో గ్రూప్ వారికి రోజుకి రెండుసార్లు 12mg మాత్ర ఇచ్చారు. దాదాపు 42 శాతం మందిలో 12mg మోతాదు లేదా 8mg మోతాదు తీసుకున్నప్పుడు కనీసం 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ జుట్టు తిరిగి పెరగడం గమనించారు. అయితే, కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. తలనొప్పి, మొటిమలు వంటి దుష్ప్రభావాలతో బాధపడ్డారు. ఇది CTP-543 అనే అలోపేసియా ఔషధం క్లినికల్ ట్రయల్స్ చివరి దశ.
బట్టతల నివారణకు అనేక చిక్సితలు ఉన్నాయి. వాటిలో ఇదొక మైలురాయిగా మేము భావిస్తున్నాము అని యేల్ యూనివర్సిటీ ప్రముఖ డెర్మటాలజిస్ట్, రీసెర్చ్ లో పాల్గొన్న డాక్టర్ బ్రెట్ కింగ్ అన్నారు. బట్టతల అనేది సవాత్ కూడి వ్యాధి. అలాంటి వాటికి మెరుగైన చికిత్సల అవసరం ఎంతైనా ఉందన్నారు. “CTP-543 ట్యాబ్లెట్.. బట్టతల బాధితులకు అత్యుత్తమ-తరగతి చికిత్సగా ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. FDAలోని డ్రగ్ రెగ్యులేటర్‌లు CTP-543ని ఆమోదిస్తాయని సంస్థ ఆశిస్తోంది. ఇది USలో అలోపేసియా అరేటాకు “మొదటి” చికిత్సలలో ఒకటిగా నిలిచింది.
కాగా, ప్రయోగంలో.. దాదాపు సగం మందిలో ఆరు నెలల్లో పూర్తి తల వెంట్రుకలు పెరిగినట్లు గుర్తించారు. ప్రస్తుత ప్రయోగ దశలో ఉన్న ఈ ట్యాబ్లెట్.. జుట్టు రాలుతున్న లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేసింది. బట్టతల నివారణకు కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఇది “ముఖ్యమైన మైలురాయి” అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో చాలామంది మగాళ్లను వేధించే సమస్య.. బట్టతల. చిన్న వయసులోనే తలపై జుట్టంతా ఊడిపోవడంతో తెగ వర్రీ అవుతుంటారు. నలుగురిలో తిరగడానికి సంకోచిస్తుంటారు. వేలకు వేలు డబ్బులు పోసి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు చేయించుకునే వారూ లేకపోలేదు. ఇలాంటి ట్రీట్ మెంట్లతో తలపై జుట్టు పెరగడం పక్కన పెడితే దీని కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్.. ప్రాణాలకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని మరిచిపోతుంటారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో బట్టతల కనిపిస్తుంటుంది. ముఖ్యంగా 35 ఏళ్ల యువకుల్లో 66 శాతానికి పైగా ఈ హెయిర్ లాస్ సమస్య అధికంగా ఉంది. కారణం.. ఆహారపు అలవాట్లు, పొల్యూషన్. వారి జీవనశైలి కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బట్టతలకు జన్యుపరమైన కారణాలతోపాటు వయసు పెరుగుదల కావచ్చు. హార్మోన్ల అసమతుల్యత సైతం దీనికి కారణవుతుంది. వివిధ అనారోగ్య సమస్యలకు వాడే మందుల ప్రభావం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి, రేడియేషన్ ప్రభావం, పోషకాహార లోపం కూడా ఇందుకు కారణం కావచ్చు. దీంతో హెయిర్ లాస్ 55శాత నుంచి 85శాతానికి పైగా పెరిగిపోతోంది.
బట్టతలగా మారబోయే ముందు కొన్ని సంకేతాలు గమనించవచ్చు. వెంట్రుకలు క్రమేణా సన్నబడుతుంటాయి. అంతేకాకుండా బలహీనంగా మారతాయి. జుట్టు ఉన్నట్టుండి ఊడిపోతుంది. తలపై పొలుసులతో కూడిన మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.