Golden Guys: వీళ్లేంట్రా సామీ..! తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇలా వచ్చారు..!

తిరుమల వెంకన్న.. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. అంతటి అలంకార ప్రియుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. ఆయన వద్దకు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం తామేమీ తక్కువ కాదన్నట్లు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో దర్శన మిచ్చింది.

Golden Guys: వీళ్లేంట్రా సామీ..! తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇలా వచ్చారు..!
Golden Guys In Tirumala

Edited By: Balaraju Goud

Updated on: Aug 23, 2024 | 1:13 PM

తిరుమల వెంకన్న.. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. అంతటి అలంకార ప్రియుడు తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. ఆయన వద్దకు మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం తామేమీ తక్కువ కాదన్నట్లు కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో దర్శన మిచ్చింది. ఏకంగా బంగారు పూత పూసిన కారులో తిరుమలకు వచ్చి, శ్రీనివాసుడిని దర్శించుకుంది. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇచ్చి విఐపి బ్రేక్ దర్శన సమయం లో వెంకన్నకు మొక్కులు తీర్చుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. సాధారణ భక్తులలాగా కాకుండా విచిత్రంగా కనిపించారు. తమ ఒంటినిండా బంగారంతో శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దాదాపు 25 కేజీలకు పైగా బంగారు నగలు ధరించి శ్రీవారి ఆలయం ముందు అబ్బుర పరిచారు. వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తులను నివ్వెరపోయేలా చేశారు. పూణేకు చెందిన గోల్డెమాన్‌లు సన్నీ నన వాగ్చోరీ, సంజయ్ దత్తాత్రయ గుజర్, ప్రీతి సోనీలు మెడలో, చేతులకు బంగారు ఆభరణాలు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం లోపల, వెలుపల అందరి దృష్టిని ఆకర్షించారు.

వీడియో చూడండి..

&

ఇక తాము వచ్చేందుకు వినియోగించిన కారు సైతం బంగారు వర్ణంతో ఉండటం విశేషం. ప్రైవేట్ సెక్యూరిటీ తో తిరుమలకు వచ్చిన పూణే కు చెందిన భక్తులు తిరుమలేశుని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

మరన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..