ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి

వేసవిలో బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రిజ్ లోపలి భాగాన్ని చల్లబరచడానికి కంప్రెసర్ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంప్రెసర్ వేడెక్కి మంటలు చెలరేగడం లేదా పేలుడు సంభవించే అవకాశం ఉంది. ఫ్రిజ్ పేలకుండా ఉండటానికి పాటించాల్సిన కీలకమైన భద్రతా చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఎండాకాలంలో మీ ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం ఉంది..! ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి
Fridge Safety Tips

Updated on: Apr 13, 2026 | 11:21 AM

ఎండా కాలంలో ఇంటి యంత్రాల వాడకం పెరుగుతుంది. ఏసీలు, కూలర్లతో పాటు రిఫ్రిజిరేటర్లు కూడా 24 గంటలు పనిచేస్తుంటాయి. బయటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రిజ్ లోపలి భాగాన్ని చల్లబరచడానికి కంప్రెసర్ నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కంప్రెసర్ వేడెక్కి మంటలు చెలరేగడం లేదా పేలుడు సంభవించే అవకాశం ఉంది. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫ్రిజ్ పేలిపోయి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ పేలకుండా ఉండటానికి పాటించాల్సిన కీలకమైన భద్రతా చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ఫ్రిజ్ ఎందుకు పేలుతుంది?: ప్రధానంగా ఫ్రిజ్ వెనుక ఉండే కంప్రెసర్ ఓవర్‌హీట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. కంప్రెసర్ లోపల ఉండే గ్యాస్ లీక్ అయినప్పుడు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు అది పేలుడుకు దారితీస్తుంది. అందుకోసం నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు:

గోడకు దూరం: ఫ్రిజ్‌ను ఎప్పుడూ గోడకు ఆనించి ఉంచకూడదు. కనీసం 6 నుండి 10 అంగుళాల దూరం ఉండాలి. దీనివల్ల కంప్రెసర్ నుండి వెలువడే వేడి బయటకు వెళ్ళడానికి గాలి ఆడుతుంది.

ఇవి కూడా చదవండి

డైరెక్ట్ ప్లగ్ పాయింట్: ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ గోడకు ఉన్న మెయిన్ ప్లగ్ పాయింట్‌కే కనెక్ట్ చేయాలి. లో-క్వాలిటీ ఎక్స్‌టెన్షన్ బోర్డులు లేదా మల్టీ-పిన్ సాకెట్లు వాడటం వల్ల హీట్ పెరిగి వైర్లు కాలిపోయే ప్రమాదం ఉంది.

కాయిల్స్ శుభ్రత: ఫ్రిజ్ వెనుక ఉండే కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము పేరుకుపోతే, వేడిని బయటకు పంపడం కష్టమవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వాటిని శుభ్రం చేయాలి.

వోల్టేజ్ స్టెబిలైజర్: మీ ఇంట్లో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటే, ఫ్రిజ్ రక్షణ కోసం మంచి స్టెబిలైజర్‌ను అమర్చుకోండి.

సర్వీసింగ్: పాత ఫ్రిజ్ అయితే కనీసం ఏడాదికి ఒకసారి టెక్నీషియన్ చేత గ్యాస్ లీకేజీలు, వైరింగ్ చెక్ చేయించుకోవాలి. ఈ క్రమంలోనే ఫ్రిజ్ నుండి వింత శబ్దాలు వస్తున్నా, లేదా వెనుక భాగం విపరీతంగా వేడెక్కుతున్నా వెంటనే దాన్ని ఆపివేసి మెకానిక్‌ను సంప్రదించాలి. చిన్నపాటి అప్రమత్తత మీ కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us