Father’s Day 2021: పితృదేవో భవ అంటూ.. అమ్మ తర్వాత స్థానం నాన్నకు ఇచ్చినా కుటుంబంలో ఎక్కువ నాన్న ఎప్పుడూ ఒంటరివాడే. ఏదైనా సందర్భం వస్తే అమ్మా,పిల్లలూ ఒక్కటౌతుంటారు. పిల్లలు అడిగిన వెంటనే ఒకే అనే అమ్మ మంచిది.. కష్టనష్టాలు అలోచించి పిల్లల కోరికను తీర్చే నాన్నా ఎప్పుడూ ఇంతే అనే నిందను పెదవుల మాటున మోస్తాడు. కనడం అమ్మే అయినా పిల్లలను పెంచడం కోసం నాన్న పడే తపన వెలకట్టలేనిది.. తన పిల్లల భవిష్యత్ కోసం కలలు కంటూ తాను కొవొత్తిలా కరిగేది నాన్న పెంచటం అమ్మే అయినా బాధ్యతెరిగి పెరగటం నాన్నవల్లే అందుకె నాన్నకు ప్రేమతో పితృదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం.
నాన్న ఉంటే భరోసా.. నాన్న ఉంటే ధైర్యం.. తాను క్రొవ్వొత్తిలా కరుగుతూ కుటుంబానికి వెలుగునిచ్ఛే వాడు నాన్న. చెప్పాలంటే రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్ఛే చెట్టులాంటి వాడు నాన్న. వేలు పట్టి నడిపించేవాడు.. నాన్న వేలు కట్టి చదివించేవాడు నాన్న. పిల్లల మన విజయం కొరకు తపించేవాడు నాన్న.. ఆ విజయం సాధిస్తే.. మురిసిపోయేవాడు నాన్న. కష్టాల గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడు నాన్న. నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాన్న అంటే భాద్యత.. నాన్న ప్రేమ గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువే.. అందుకే నాన్న కష్టాన్ని , ఇష్టాన్ని గుర్తించి నాన్న మనసు నొప్పించకుండా నాన్న చేయి పట్టుకుని నడుస్తున్న పిల్లలకు వందనం.
అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని మంచి మాత్రమే కనిపిస్తుంది. అదే నాన్నకు తప్పుఒప్పులు కనిపిస్తాయి. తప్పుని సరిచేయడానికి దండించడం కూడా తన బాధ్యతగానే తీసుకుంటాడు నాన్న.. ఆకలితీర్చటం అమ్మవంతు అయితే, పిల్లల ఆశలుతీర్చటం నాన్నవంతు. కనిపించే దేవత అమ్మ అయితే, కనపడని దేవుడు నాన్న. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్‌డే ని సెలెబ్రేట్ చేసుకుంటారు.. కానీ రోజూ నాన్న సేవలకు ప్రేమకు గుర్తింపు ఇవ్వాల్సిందే.. వెలకట్టలేని త్యాగాల నిధి నాన్నకు పితృదినోత్సవ శుభాకాంక్షలు