Telangana: విధి ఆ కుటుంబంతో ఆడిన ఆట చూస్తే కన్నీళ్లు రాకమానవు… గుండెను బరువెక్కించే ట్రాజెడీ

|

Sep 15, 2021 | 2:32 PM

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అందుకే పెద్దలు 'కాళ్లు తడవకుండా సముద్రం దాటినవారు అయినా ఉంటారు కానీ, కళ్లు తడవకుండా జీవితం దాటిన వారు మాత్రం ఉండరు' అని అంటారు.

Telangana: విధి ఆ కుటుంబంతో ఆడిన ఆట చూస్తే కన్నీళ్లు రాకమానవు... గుండెను బరువెక్కించే ట్రాజెడీ
Tragedy
Follow us on

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. అందుకే పెద్దలు ‘కాళ్లు తడవకుండా సముద్రం దాటినవారు అయినా ఉంటారు కానీ, కళ్లు తడవకుండా జీవితం దాటిన వారు మాత్రం ఉండరు’ అని అంటారు. అయితే మన కష్టాలకు మనం కన్నీళ్లు పెట్టడం సహజం. ఎదుటివారి కష్టాలు విని లేదా చూసి మనం కన్నీళ్లు పెట్టడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. తాజాగా విధి ఓ కుటుంబంతో ఆడిన ఆట చూస్తే మీకు కన్నీళ్లు రాక మానవు. కుటుంబ కలహాలతో మహిళ పురుగుల మందు తాగగా.. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్య ఖర్చుల కోసం డబ్బులు తీసుకొని బైక్‌పై ఆ మహిళ భర్త, కొడుకు, వారి బంధువు ముగ్గురు కలిసి ఖమ్మం వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు. పురుగు మందు తాగిన తల్లి కూడా మంగళవారం రాత్రి మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు గురించి తెలిసిన స్థానిక ప్రజలు కూడా కన్నీరు పెడుతున్నారు. చూశారా విధి మనుషుల జీవితాలతో ఎటువంటి ఆట ఆడుకుంటుందో.

గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు మిస్సింగ్

గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమవడంపై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఒకే ఫ్యామిలీకి చెందిన  చెందిన 14, 16 సంవత్సరాల వయస్సు గల అక్కాచెల్లెళ్ళు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో పేరెంట్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో… గ్రామస్థుల సాయం తీసుకొని రాత్రంతా వెతుకుతూ.. తెలిసిన వాళ్లకి ఫోన్​లు చేశారు. ఏం చేసినా లాభం లేకపోయేసరికి మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ శ్యామల రాజీవ్ కుమార్ తెలిపారు. అదృశ్యమైన బాలికల్లో ఒకరు ఇంటర్, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు.

Also Read:రంగంలోకి నేరుగా డీజీపీ.. 70 టీమ్స్ ఏర్పాటు.. తెలివిగా తప్పించుకుంటున్న నిందితుడు

లీటరు రూ.50 ఉండే మేకపాలు.. రూ.1500 పెట్టినా దొరకట్లేదు.. ఎందుకంటే…?