Kitchen Hacks: కొత్త చాపింగ్ బోర్డు కొనాలనుకుంటున్నారా..? ముందు ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి..!

చాపింగ్ బోర్డును శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఉపయోగించవచ్చు. ముందుగా బోర్డుపై ఉప్పు చల్లి, నిమ్మకాయతో రుద్దడం ద్వారా చెడు వాసనలు పోతాయి. బేకింగ్ సోడా, నిమ్మకాయతో కూడా బోర్డు శుభ్రం చేయవచ్చు. చాపింగ్ బోర్డు పై మురికి లేదా వాసనలు ఉండకుండా.. ప్రతిసారీ వాడిన తర్వాత నీటితో శుభ్రం చేసి గాలి తగిలేలా ఉంచడం చాలా అవసరం.

Kitchen Hacks: కొత్త చాపింగ్ బోర్డు కొనాలనుకుంటున్నారా..? ముందు ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి..!
Chopping Board Cleaning

Updated on: Jan 26, 2025 | 5:31 PM

మనం ఎక్కువగా వంట చేసేటప్పుడు చాపింగ్ బోర్డుతో చాలా అవసరం ఉంటుంది. కూరగాయలను, పండ్లను వేగంగా కట్ చేసేందుకు ఈ బోర్డు ఎంత ఉపయోగపడుతుందో అందిరికీ తెలిసిందే. కానీ ఇది కొద్ది రోజుల్లోనే మురికిగా మారుతుంది. పైగా దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని సింపుల్ చిట్కాలను మీ కోసం తీసుకొచ్చాను. ఈ చిట్కాలను ఫాలో అయ్యి మీ చాపింగ్ బోర్డును కొత్తదానిలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ, ఉప్పు

ముందుగా బోర్డుపై ఉప్పు చల్లండి. తర్వాత నిమ్మకాయను తీసుకుని దానితో బోర్డు అంతా రుద్దండి. దీనిని పావు గంట సేపు అలాగే ఉంచి ఆ తర్వాత బోర్డును గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా చేస్తే ఉప్పు నిమ్మరసం కలిసిన రసాయనాలు కట్టింగ్ బోర్డు నుండి చెడు వాసనలను తీసి శుభ్రం చేస్తాయి.

ఆపిల్, బంగాళాదుంప

చాపింగ్ బోర్డు దుర్వాసనను తొలగించడానికి ఆపిల్ లేదా బంగాళాదుంపను ఉపయోగించవచ్చు. ముందుగా ఆపిల్ లేదా బంగాళాదుంపను ముక్కలు చేసుకొని వాటిని బోర్డుపై రుద్దండి. ఆ రసం బోర్డు మీద పూర్తిగా పీల్చుకునే వరకు 10-15 నిమిషాలపాటు పక్కకు ఉంచండి. ఆ తర్వాత నీటితో కడగండి. ఈ చిట్కాతో చాపింగ్ బోర్డు నుంచి తాజా సువాసన వస్తుంది.

బేకింగ్ సోడా, నిమ్మకాయ

ప్రతి వారం ఈ చిట్కా అనుసరించడం వల్ల మీ చాపింగ్ బోర్డు కొత్తగా కనిపిస్తుంది. ముందుగా బోర్డుపై బేకింగ్ సోడాను చల్లుకోండి. తర్వాత నిమ్మకాయను తీసుకుని దాన్ని చాపింగ్ బోర్డుపై రుద్దండి. నిమ్మరసం బాగా పట్టిన తర్వాత బోర్డును కనీసం 15 నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో బోర్డు బాగా కడగండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు, పండ్లు కట్ చేసిన మురికి, దుర్వాసన పోతాయి.

మీ చాపింగ్ బోర్డు గట్టిగా ఉండేందుకు దాన్ని మీరు ప్రతిసారి యూజ్ చేయగానే మంచి నీటితో కడగడం చాలా ముఖ్యం. ఇది మురికి, చెడు వాసనలకు నివారిస్తుంది. చాపింగ్ బోర్డు ఎక్కువ రోజులు వస్తుంది. మీ చాపింగ్ బోర్డును నీటితో శుభ్రం చేసిన ప్రతీసారి ఒక మంచి కాటన్ క్లాత్ తో తుడిచి గాలి తగిలేలా ఉంచండి.