Loan: లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు ఈ పని చేయండి.. ఏ సమస్యా రాదు..!

|

Dec 06, 2022 | 11:28 AM

జీవితంలో అప్పు అనే సహజం. అత్యవసరం అయినప్పుడు అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఏదైనా కొనాలన్నా, మరే అవసరం వచ్చినా.. అప్పు తీసుకుంటుంటారు.

Loan: లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందు ఈ పని చేయండి.. ఏ సమస్యా రాదు..!
Bank Loans
Follow us on

జీవితంలో అప్పు అనే సహజం. అత్యవసరం అయినప్పుడు అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇంటి అవసరాల కోసం ఏదైనా కొనాలన్నా, మరే అవసరం వచ్చినా.. అప్పు తీసుకుంటుంటారు. ఇల్లు కట్టడం, పెళ్లి చేసుకోవడం, చదువు మొదలైన అవసరాల కోసం కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజలు ఎంత కష్టపడి పని చేసినా ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో జనాలు.. ఎన్‌బిఎఫ్‌సి కంపెనీలు, బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతారు. అయితే, రుణం ఈజీగా పొందాలంటే, రుణం పొందిన తరువాత ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు.. రుణం తీసుకునే ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదే సిబిల్ స్కోర్ చెకింగ్. అవును, సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు రుణాలను మంజూరు చేస్తాయి. సిబిల్ స్కోర్ సరిగా ఉంటే బ్యాంకులు రుణాలను ఇస్తాయి. మరి సిబిల్ స్కోర్‌ను మనం ముందే ఎలా చెక్ చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం..

మీ సిబిల్(CIBIL) స్కోర్‌ని ఇలా చెక్ చేసుకోండి..

1. సిబిల్ స్కోర్‌ని చెక్ చేయడం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, అందరికీ అందుబాటులో, చాలామంది ఉపయోగించబడుతున్న ఒక యాప్ గురించి మనం తెలుసుకుందాం. ప్లే స్టోర్ నుంచి పేటీఎమ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పటికే మీ ఫోన్‌లో ఈ యాప్ ఉంటే.. దానిని అప్‌డేట్ చేయండి.

2. మొబైల్ నెంబర్, ఓటీపీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చెయ్యాలి. యాప్‌లో సిబిల్ స్కోర్ చెకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. సిబిల్ స్కోర్ పై క్లిక్ చేసి పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్ నెంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని నింపాలి. ఆ తరువాత మీ సిబిల్ స్కోర్ ఎంత ఉందో యాప్‌లో చూపిస్తుంది.

సిబిల్ స్కోర్ మంచి స్థితిలో ఉంటే.. మీకు రుణ మంజూరు త్వరగా అవుతుంది. అలాగే తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు అవుతాయి. అయితే, ఈ సిబిల్ స్కోర్ మంచి స్థితిలో ఉండాలంటే మీరు రుణాలకు సంబంధించిన ఈఎంఐలు, వాయిదాలను సరైన సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. సక్రమంగా చెల్లించకపోతే.. ఫైన్ పడటమే కాకుండా, సిబిల్ స్కోర్‌పై దాని ప్రభావం చూపుతుంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..