మీ వెహికల్‌ RC పోయిందా..? కంగారుపడకండి.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!

వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) పోగొట్టుకుంటే కంగారు పడవద్దు. ఈ ఆర్టికల్ వాహన పోర్టల్, డిజి లాకర్ ద్వారా ఆన్‌లైన్‌లో RCని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సరళమైన దశలతో, మీరు త్వరగా మీ RCని పొందవచ్చు. వాహన నంబర్, ఛాసిస్ నంబర్ వంటి వివరాలు అవసరం.

మీ వెహికల్‌ RC పోయిందా..? కంగారుపడకండి.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!
Rc

Updated on: Jun 01, 2025 | 6:04 PM

మీరు బైక్‌, కార్‌ లేదా ఇతర ఫోర్‌, త్రీ వీలర్‌ ఏ వాహనం కొనుగోలు చేసినా మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్.. అంటే RC ఇస్తారు. మీరు వాహనం యజమాని అని చెప్పడానికి RC అధికారిక రుజువు. మీరు వాహనం నడుపుతున్నప్పుడు లేదా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు RC తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపితే, వారు మొదట అడిగేది రెండు విషయాలు.. డ్రైవింగ్ లైసెన్స్, RC. అయితే కొంత మంది పొరపాటున RC కనిపించకపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్న తెగ కంగారు పడిపోతుంటారు. విషయం ఏంటంటే.. అలా కంగారు పడాల్సి పనిలేదు. ఎందుకంటే RCని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని వాహన పోర్టల్ ద్వారా చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RCని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియ

  • అధికారిక వాహన్ పోర్టల్‌ని ఓపెన్‌ చేయాలి
  • “ఆన్‌లైన్ సర్వీస్‌” పై క్లిక్ చేసి, “వెహికల్‌ సర్వీస్‌” ఎంచుకోండి.
  • మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, OTP ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌ను నమోదు చేయండి.
  • తగిన విభాగానికి వెళ్లండి (“డౌన్‌లోడ్ డాక్యుమెంట్” లేదా “RC ప్రింట్” వంటివి – రాష్ట్ర పోర్టల్ ప్రకారం కచ్చితమైన లేబుల్ మారవచ్చు).
  • కేవలం కొన్ని క్లిక్‌లలో మీ RC ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

డిజిలాకర్ ఉపయోగించి డౌన్‌లోడ్ ప్రక్రియ

  • డిజిలాకర్ వెబ్ పేజీ లేదా యాప్ ని ఓపెన్‌ చేయండి.
  • మీ ఆధార్‌కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • ‘రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ’ విభాగానికి వెళ్లండి.
  • ‘రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్’ ఎంచుకుని, మీ వాహన వివరాలను నమోదు చేయండి.
  • మీ ఆధార్‌లోని పేరు మీ ఆర్‌సిలోని పేరుతో సరిపోలుతుందని నిర్ధారించుకోండి.
  • మీ పరికరంలో మీ RC ని ప్రివ్యూ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • మీ డిజిటల్ RC ‘జారీ చేయబడిన పత్రాలు’ విభాగంలో కనిపిస్తుంది. ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు.