Vastu Tips: ఈ వాస్తు దోషాలుంటే.. ఇంట్లో తరచూ అనారోగ్యం బారిన పడతారు

|

Apr 04, 2024 | 5:20 PM

ఇంట్లో ఈశాన్య దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ దిశను సానుకూల శక్తులకు కేంద్రంగా చెబుతుంటారు. అందుకే ఈశాన్యం దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. అలాంటి ఈశాన్యం దిశలో తలెత్తే వాస్తు దోషాలు తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని...

Vastu Tips: ఈ వాస్తు దోషాలుంటే.. ఇంట్లో తరచూ అనారోగ్యం బారిన పడతారు
Vastu Tips
Follow us on

వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తు ఎక్కువగా విశ్వసిస్తుంటారు. ఇంటి నిర్మాణం మొదలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల వరకు అన్ని విషయాల్లో వాస్తును తప్పకుండా పాటిస్తుంటారు. ఒకవేళ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే పలు రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని వాస్తు పండితులు హెచ్చరిస్తుంటారు. ఇలాంటి వాటిలో ఈశాన్య దిశ ప్రముఖమైంది.

ఇంట్లో ఈశాన్య దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ దిశను సానుకూల శక్తులకు కేంద్రంగా చెబుతుంటారు. అందుకే ఈశాన్యం దిశలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. అలాంటి ఈశాన్యం దిశలో తలెత్తే వాస్తు దోషాలు తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ ఈశాన్యం దిశలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు ప్రకారం, మాస్టర్ బెడ్‌రూమ్‌ను ఎప్పుడూ ఈశాన్య మూలలో నిర్మించకూడదు. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులకు గురి చేసింది.

* ఒకవేళ పడకగది ఈశాన్య మూలలో ఉన్నట్లయితే, దాని వాస్తు దోషాలను తొలగించడానికి, వాస్తు యంత్రాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. ఇది కాకుండా, వాస్తు దోషాలను తొలగించడానికి, మీ పడకగదిని వాస్తు ప్రకారం నీలం, పసుపు లేదా ఆకుపచ్చ రంగు వేయాలి.

* వాస్తు ప్రకారం ఈశాన్యంలో వంటగది ఉండకూడదు. ఒకవేళ ఈ దిశలో వంట గది ఉంటే కుటుంబ సభ్యులు నిత్యం అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈశాన్యం నీటికి సింబల్‌గా చెబుతారు, వంటగది అగ్నికి చిహ్నంగా చెబుతారు. అందుకే ఈ రెండు ఒకే చోట ఉండకూడదు.

* అలాగే ఈశాన్య మూలను వీలైనంత వరకు ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. ఈ దిశలో ఎలాంటి చెత్తా చెదారం వేయకూడదు. పొరపాటున కూడా ఈ త్పపు చేస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదు.

* ఈశాన్యం దిశలో పాత వస్తువులు, చెప్పులు, డస్ట్‌బిన్‌, భారీ ఫర్నిచర్‌ లాంటివి పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆనందం దూరమై మానసిక ప్రశాంతత దెబ్బ తింటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..