Viral Video: జాతివైరం మరిచి… మాతృత్వం చాటి.. పిల్లికి పాలు ఇస్తోన్న శునకం

కుక్కతో పిల్లి స్నేహం.. వినడానికి వింతగా ఉన్నా స్నేహానికి జాతి వైరం ఉండదని చెపుతున్నాయి ఈ దృశ్యాలు. ఎదుటి వారిని చూసి..

Viral Video: జాతివైరం మరిచి... మాతృత్వం చాటి.. పిల్లికి పాలు ఇస్తోన్న శునకం
Dog Cat Friendship

Updated on: Oct 18, 2021 | 9:23 AM

కుక్కతో పిల్లి స్నేహం.. వినడానికి వింతగా ఉన్నా స్నేహానికి జాతి వైరం ఉండదని చెపుతున్నాయి ఈ దృశ్యాలు. ఎదుటి వారిని చూసి ఈర్ష్యపడుతూ, దిగజార్చే విధంగా మనుషులే మాట్లాడుకుంటున్న ఈ కాలంలో జాతి వైరం మరిచి ప్రేమానురాగాలే పెద్ద దిక్కుగా కుక్కతో పిల్లి సాగిస్తున్న స్నేహం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. కడుపు మంటతో ఉన్న ఎదుటువాని ఆకలి తీర్చేందుకు కూడా మానవత్వం చూపని ఈ రోజుల్లో… మానవత్వపు పరిమళాలలు పూయిస్తోంది ఈ కుక్క, పిల్లి స్నేహం. జాతివైరాన్ని మరిచి ఈ రెండు జంతువులు వాటిలోని ఆత్మీయతను చాటుకుంటున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. కుక్క, పిల్లి రెండు కలిసి మెలిసి ఉంటుండడమే ఇక్కడ జరుగుతున్న విచిత్రం. వారం రోజులుగా పిల్లి శునకం పాలు తాగుతూ దానితోనే ఆడుకుంటోంది. సాన్నిహిత్యంగా మెదులుతున్న ఈ రెండింటి తీరు చూసి స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. శునక, మార్జాల మద్య యుద్దం ముగిసి ప్రేమా అనురాగాలు చిగురించిన తీరుగా ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సమాజం కూడా ఈ రెండు జంతువుల తీరుగా జాతి వైరాన్ని మరిచి కలిసిమెలిసి సాగితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు జనం.

నరేశ్ స్వేన, ఆదిలాబాద్, టీవీ9 తెలుగు 

Also Read: పండక్కి అత్తగారింటకి వచ్చి బైక్స్‌కు ఫైన్ వేసిన ఎస్సై… గ్రామస్తులు ఏం చేశారంటే

వారెవ్వా.. శ్రీమతిని తీసుకెళ్లేందుకు ఏకంగా ట్రాక్టర్‌పైనే వచ్చాడు.. క్రేజీ వీడియో

Follow Us