Pinky Finger: మీ చిటికెన వేలు సైజును బట్టి.. మీ అసలు స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు..

శరీరంలో ఉండే పుట్టు మచ్చల ఆధారంగా వ్యక్తుల మనస్తత్వాలను, వారి భవిష్యత్తును అంచనా వేస్తారనే విషయం తెలిసిందే. అయితే శరీర అవయవాల ఆకారంతో కూడా మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిటికెన వేలు..

Pinky Finger: మీ చిటికెన వేలు సైజును బట్టి.. మీ అసలు స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు..

Updated on: Dec 01, 2022 | 11:30 AM

శరీరంలో ఉండే పుట్టు మచ్చల ఆధారంగా వ్యక్తుల మనస్తత్వాలను, వారి భవిష్యత్తును అంచనా వేస్తారనే విషయం తెలిసిందే. అయితే శరీర అవయవాల ఆకారంతో కూడా మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిటికెన వేలు సైజ్‌ను బట్టి మీ స్వభావం ఎలాంటిది.? మీరు ఎలాంటి వారు చెప్పొచ్చంటున్నారు.

మీ చిటికెన సైజ్‌ ఒకవేళ పైన ఫొటోలో ఉన్న విధంగా ఉంటే.. మీరు ప్రశాతంమైన మనస్సును కలిగి ఉంటారు. భావోద్వేగాలను, ఆలోచనలను నియంత్రించుకోవడంలో మంచి సామర్థ్యం కలిగి ఉంటారు. మీ జీవితానికి గందరగోళం కలిగించే వ్యక్తులు, స్థలాలకు మీరు తప్పించుకుంటారు. పెద్ద పెద్ద కోరికలు కాకుండా మితంగా ఆలోచిస్తారు. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆలోచనతో ఉంటారు. ఎక్కువగా అంతర్ముఖులుగా ఉంటారు. అందరిలో అంత సులభంగా కలవలేరు.

ఇవి కూడా చదవండి


మీ చిటికెన వేలు పరిమాణం ఒకవేళ పైన ఫొటోల ఉన్నట్లు ఉంటే.. మీరు భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీకు తెలిసిన విషయంపై పూర్తి నమ్మకంతో ఉంటారు. సేవా కార్యక్రమాల్లో, ఇతరులకు సాయం చేయడంపై ఆసక్తి కలిగి ఉంటారు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉంటారు. మీకన్న తక్కువ వారిపై దయతో ఉంటారు. విలువల కోసం రాజీపడడం ఇష్టపడరు. పెద్ద కలలు కంటారు.

మీ చిటికెన వేలు సైజ్‌ పరిమాణం పైన తెలిపిన ఫొటో మాదిరిగా ఉంటే.. మీరు చాలా సెన్సిటివ్‌ వ్యక్తులై ఉంటారు. మీరు ప్రేమను చూపడానికి మొగ్గు చూపుతారు. మీ ఆలోచనలను ఇతరులతో అంత ఈజీగా పంచుకోలేరు. ప్రతీ అంశాన్ని విశ్లేషణాత్మక కోణంలో చూస్తారు. ఇతరుల అభిప్రాయాలతో అంత సులభంగా ప్రభావితమవుతారు. చాలా ధైర్యంతో ఉంటారు. మీరు నమ్మిన విషయాన్ని చాలా బలంగా విశ్వసిస్తారు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణులు చెప్పిన విషయాల ఆధారంగా అందించినది మాత్రమే. ఈ విషయాల్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..