Indian railways: జనరల్‌ బోగీలు రైలుకు చివర్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా.?

| Edited By: Ram Naramaneni

Jan 27, 2024 | 4:57 PM

ఇక ఇండియన్‌ రైల్వేకు సంబంధించి ఎన్నో విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి వాటిలో రైల్వేకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ రైలును గమనిస్తే.. రైలులో జనరల్‌ బోగీలు రైలుకు మొదట్లో, చివరల్లో ఉంటాయి. అయితే జనరల్‌ బోగీలు ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఏంటన్న దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా.?

Indian railways: జనరల్‌ బోగీలు రైలుకు చివర్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా.?
Indian Railways
Follow us on

ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఇండియన్‌ రైల్వేస్‌ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో కోట్లాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో ఇండియన్‌ రైల్వేస్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ ధరలో సుదూర గమ్యాలకు చేరుకోవడంలో రైల్వేలను ఆశ్రయిస్తుంటారు.

ఇక ఇండియన్‌ రైల్వేకు సంబంధించి ఎన్నో విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి వాటిలో రైల్వేకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్‌ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ రైలును గమనిస్తే.. రైలులో జనరల్‌ బోగీలు రైలుకు మొదట్లో, చివరల్లో ఉంటాయి. అయితే జనరల్‌ బోగీలు ఇలా ఉండడానికి ప్రధాన కారణం ఏంటన్న దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా.? జనరల్‌ బోగీలు ఇలా రైలుకు చివర్లో ఉండడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా రిజర్వేషన్‌ బోగీలతో పోల్చితే.. జనరల్‌ కోచ్‌లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ రెండు కోచ్‌లు చివర్లో ఏర్పడు చేయడం వల్ల జనరల్‌ బోగీ ప్రయాణికులు సరిసమానంగా ముందు, వెనుకకు వెళ్తారు. రైల్వే స్టేషన్‌లో రైలు ఆగిన సమయంలో జనరల్‌ బోగీ నుంచి పెద్ద ఎత్తున దిగే ప్రయాణికులు రెండు వైపుల సమానంగా వెళ్తారు. దీనివల్ల స్టేషన్‌లో జనాలు పెద్ద ఎత్తున గుమిగూడరు. ప్రయాణికులను రెండు వైపులా డివైడ్‌ చేయడం వల్ల రద్దీని నియంత్రించవచ్చు.

ఇక ఎప్పుడైనా రైల్వే ప్రమాదాలు జరిగిన సమయంలో సహాయక చర్యలు సౌలభ్యంగా ఉండేందుకు కూడా జనరల్‌ కోచ్‌లను రైలుకు రెండు చివర్లలో ఏర్పాటు చేస్తారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికులు ఒకేచోట భారీగా గుమికూడకుండా ఉండేందుకు ఇది ఉపయోగపపడుతుంది. జనరల్ బోగీలు రైలుకు రెండు చివర్లలో ఉండడానికి కారణాలు ఇవే.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..