Nitrogen: నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష అమలు.. ఇంతకీ నైట్రోజన్‌తో అసలు ఉపయోగాలు ఏంటో తెలుసా?
దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే అసలు నైట్రోజన్ వాయువు కేవలం మనిషి ప్రాణాలు తీయడానికే ఉపయోగపడుతుందా.? అంటే పొరపడినట్లే నైట్రోజన్‌ను మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తుంటాం. ఇంతకీ నైట్రోజన్ వాయువు ఉపయోగాలు ఏంటి.?
సాధారణంగా మరణ శిక్ష అంటే ఉరితాడు వేసి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో తల నరికేస్తారు. అదే నైట్రోజన్‌తో మరణశిక్ష వేస్తే ఎలా ఉంటుంది. నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి అమలు చేసిన మరణశిక్షకు సంబంధించిన వార్త బాగా వైరల్ అయ్యింది.
సుమారు 30 ఏళ్ల క్రితం సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికాలో ఈ విధంగా మరణశిక్షను విధించారు. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలు చేశారు. దీంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఇంతకీ నైట్రోజన్ ద్వారా మనిషి ఎలా మరణిస్తాడంటే.. ఇది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది.
దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. ఇదంతా ఇలా ఉంటే అసలు నైట్రోజన్ వాయువు కేవలం మనిషి ప్రాణాలు తీయడానికే ఉపయోగపడుతుందా.? అంటే పొరపడినట్లే నైట్రోజన్‌ను మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తుంటాం. ఇంతకీ నైట్రోజన్ వాయువు ఉపయోగాలు ఏంటి.? దానిని ఎందుకు ఉపయోగిస్తాం.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నైట్రోజన్ వాయు రూపంలో ఉంటుంది. వాతావరణంలో నైట్రోజన్ విరివిగా ఉంటుంది. ఇక నైట్రోజన్‌ను ఫార్మా నుంచి మైనింగ్, ఫుడ్ బెవరేజ్, మెటల్, ఎలక్ట్రానిక్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. నైట్రోజన్‌ను తెలుగులో నత్రజనిగా పిలుస్తారు. నిజానికి నైట్రోజన్ విష వాయువు కాదు, ఆక్సిజన్‌ను లేకుండా చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతుంది. ఆహార పదార్థాలు నిల్వ ఉండడానికి ఈ వాయువును ఉపయోగిస్తారు. ఆక్సిజన్ తాకడం వల్ల కూరగాయలు, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కాబట్టి నైట్రోజన్‌ను ఉపయోగించడం వల్ల ఆక్సిజన్ తొలగిపోయి కూరగాయలు త్వరగా పాడవవు.
అందుకే చిప్స్‌తో పాటు, ఫుడ్ స్టోరేజ్ చేసే ప్యాకెట్స్‌లో నైట్రోజన్ గాలిని నింపుతారు. ఇక నైట్రోజన్‌ను ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సైతం ఉపయోగిస్తారు. ముఖ్యంగా లైట్ బల్బుల్లో నైట్రోజన్‌ను ఉపయోగిస్తారు. దీనికి కారణం బల్బుల్లో ఉండే టంగ్‌స్టన్ ఫిలమెంట్, బల్బ్ నుంచి వచ్చే వేడికి ఆక్సిజన్ తోడు కావడంతో అవి కాలిపోతాయి. అందుకే ఇందులో ఆక్సిజన్ లేకుండా ఉండడానికి నైట్రోజన్ వాయువుతో నింపుతారు. ఇక నైట్రోజన్ వాయువును కార్లు, విమానాలు, బైక్ టైర్లలో కూడా నింపడానికి ఉపయోగిస్తారు. దీనిద్వారా టైర్స్‌లో ఒత్తిడి ఎక్కువ కాలం స్థిరంగా ఉండేలా చేస్తుంది. వాహనం మెరుగైన మైలేజ్ నైట్రోజన్ గాలితో నింపిన టైర్లు ఉపయోగపడతాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..