Gold: కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..

|

Mar 28, 2024 | 5:34 PM

కలలు రావడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే కలలో మనకు కనిపించే వస్తువులు మన భవిష్యత్తును అంచనా వేస్తుందని పండితులు చెబుతుంటారు. మరి కలలో బంగారం కనిపిస్తే దేనికో సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.? బంగారం అనగానే అన్నీ పాజిటివ్‌ వైబ్స్‌ వినిపిస్తాయి. బంగారం అంటేనే సంపదకు...

Gold: కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
Gold in dream
Follow us on

కలలు రావడం సర్వసాధారణం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. అయితే కలలో మనకు కనిపించే వస్తువులు మన భవిష్యత్తును అంచనా వేస్తుందని పండితులు చెబుతుంటారు. మరి కలలో బంగారం కనిపిస్తే దేనికో సంకేతమో ఎప్పుడైనా ఆలోచించారా.? బంగారం అనగానే అన్నీ పాజిటివ్‌ వైబ్స్‌ వినిపిస్తాయి. బంగారం అంటేనే సంపదకు చిహ్నంగా భావిస్తారు. మరి అలాంటి బంగారం కలలో కనిపిస్తే ఎలాంటి వాటికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* బంగారం సంపదకు చిహ్నమైనప్పటికీ మీకు ఒకవేళ కలలో బంగారు అభరణాలు కనిపిస్తే మీరు భవిష్యత్తులో చాలా డబ్బు ఖర్చు చేయబోతున్నారని అర్థం. ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన సమయమని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ నేలపై పడిన బంగారాన్ని తీసుకుంటున్నట్లు కల వస్తే కూడా అశుభమని పండితులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే కొన్ని రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి కలలు వేస్తే ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

* ఇక మీ నగలు పోగొట్టుకున్నట్లు కలలు వచ్చినా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. డబ్బు నష్టం వెంటాడుతుందని దీని అర్థం.

* ఒకవేళ మీ నగలను ఎవరైనా దొంగలించినట్లు కల వస్తే అది కూడా మంచిది కాదు. ఇలాంటి కల వస్తే మీరు వ్యాపారంలో ఊహించని నష్టం ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అర్థం. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని అర్థం.

* అయితే కలలో ఒకవేళ మీరు బంగారు అభరణాలను కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తే మాత్రం శుభ సూచికమని పండితులు చెబుతున్నారు. మీరు ఆర్థికంగా ఎదిగేందుకు సూచనగా చెబుతున్నారు. అలాగే బంగారు అభరణాలు బహుమతిగా తీసుకుంటున్నల్లు కల వస్తే ఆర్థికంగా కలిసి వస్తుందని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం కొందరు పండితులు తెలిపిన విషయాలు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..