Dream: మీరు చనిపోయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

డ్రీమ్‌ సైన్స్‌ ప్రకారం.. సహజంగా చావును చెడుగా భావిస్తాం, కలలో చనిపోయిన దృశ్యాలు కనిపిస్తే భయపడతాం. కానీ కలలో మీరు చనిపోయినట్లు కనిపిస్తే మంచిదేనని శాస్త్రం చెబుతోంది. మీరు చనిపోయినట్లు మీకే కల వస్తే.. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు త్వరలో ముగుస్తాయని అర్థం. త్వరలోనే మీకు విజయం దక్కబోతుందని అని చెప్పేందుకు ఈ కల ఒక సూచికగా చెబుతుంటారు...

Dream: మీరు చనిపోయినట్లు కల వచ్చిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
Dream

Updated on: Apr 06, 2024 | 6:13 PM

నిద్రలో కలలు రావడం సర్వసాధారణం. పడుకున్న సమయంలో ఏదో ఒక సంఘటన జరుగుతున్నట్లు కల వస్తుంది. అయితే పడుకున్న తర్వాత వచ్చే కల మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తుందని మానసిక నిపుణులతో పాటు, పండితులు సైతం చెబుతున్నారు. డ్రీమ్‌ సైన్స్‌ ప్రకారం మనకు నిద్రలో వచ్చే ప్రతీ ఒక కలకు ఒక అర్థం ఉంటుందని అంటున్నారు. మరి మరణానికి సంబంధించిన కల వస్తే ఏమవుతుంది.? ఇది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రీమ్‌ సైన్స్‌ ప్రకారం.. సహజంగా చావును చెడుగా భావిస్తాం, కలలో చనిపోయిన దృశ్యాలు కనిపిస్తే భయపడతాం. కానీ కలలో మీరు చనిపోయినట్లు కనిపిస్తే మంచిదేనని శాస్త్రం చెబుతోంది. మీరు చనిపోయినట్లు మీకే కల వస్తే.. మీ జీవితంలో జరుగుతున్న సమస్యలు త్వరలో ముగుస్తాయని అర్థం. త్వరలోనే మీకు విజయం దక్కబోతుందని అని చెప్పేందుకు ఈ కల ఒక సూచికగా చెబుతుంటారు.

ఇక కలలో ఇతర వ్యక్తులు ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే అది కూడా శుభ సంకేతమనే చెబుతున్నారు. మీకు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు త్వరలోనే నిజం కానున్నాయని దాని అర్థం. రాబోయే రోజుల్లో మీరు జీవితంలో మంచి విజయాన్ని పొందుతారని అర్థం. ఇక ఒకవేళ కలలో మీకు నచ్చిన వ్యక్తి మృతదేహాన్ని చూసినా వారికి ఎలాంటి ప్రమాదం జరగబోదని అర్థం.

అయితే చనిపోయిన బంధువులు కలలోకి వస్తే మాత్రం అశుభమని శాస్త్రం చెబుతోంది. కష్టాల్లో ఉన్న సమయంలోనే చనిపోయిన బంధువులు కలలోకి వస్తారని పండితులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మీకు పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని దీని అర్థంగా చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన విషయాలు ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..