Pub Vs Club: బార్‌, పబ్‌, క్లబ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం చేస్తారో తెలుసా..

|

May 07, 2022 | 3:04 PM

సాయంత్రం అయితే చాలు.. కొంత మంది మద్యం ప్రియులు బార్‌, పబ్‌, క్లాబ్‌లలో ప్రత్యక్షమౌతారు. పిచ్చాపాటి కబుర్లలోపడి ఫూటుగా తాగేసి.. తూగుతూ బయట పడతారు. ఐతే మీరెప్పుడైనా..

Pub Vs Club: బార్‌, పబ్‌, క్లబ్‌లకు ఎప్పుడైనా వెళ్లారా? లోపల ఏం చేస్తారో తెలుసా..
Pub Culture
Follow us on

Difference Between Pub and Club on Basis of Service: సాయంత్రం అయితే చాలు.. కొంత మంది మద్యం ప్రియులు బార్‌, పబ్‌, క్లాబ్‌లలో ప్రత్యక్షమౌతారు. పిచ్చాపాటి కబుర్లలోపడి ఫూటుగా తాగేసి.. తూగుతూ బయట పడతారు. ఐతే మీరెప్పుడైనా పబ్‌లు, బార్‌లు వంటివాటి బోర్డులను పరిశీలించారా? అసలు బార్‌లకు, పబ్‌లకు, క్లబ్‌లకు తేడా ఏమిటి? ఈ గెట్‌టుగెదర్ ప్రదేశాలన్నీ ఒకేలా ఉంటాయా? ఆ విశేషాలు మీకోసం..

బార్‌లలో సర్వీస్‌ ఏ విధంగా ఉంటుందంటే..
బార్లలో మద్యం అమ్మకాలకు అనుమతి ఉంటుంది. అంటే బార్లలకు వెళ్లినవారు అక్కడే టేబుళ్ల వద్ద కూర్చుని, వెయిటర్లకు ఆర్డర్‌ ఇచ్చి, నచ్చిన మద్యం సేవించవచ్చు. ఐతే ప్రత్యేక లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే, మద్యం విక్రయాలకు బార్‌లకు అనుమతి ఉంటుంది. బార్‌లో సిగరేట్‌లు కూడా కాల్చవచ్చు. తినేందుకు కొన్ని ఐటమ్స్‌ ఉంటాయి.

పబ్‌లలో ఏ విధమైన సర్వీస్‌ ఉంటుందంటే..
పబ్ అనేది పబ్లిక్ హౌస్ లాంటిది. ఇక్కడ కూడా మద్యం సేవించవచ్చు. ఐతే బార్ – పబ్‌కు కొన్ని వ్యత్యాసాలున్నాయి. సాధారణంగా బార్‌లో కొన్ని టేబుల్లు ఉంచి, ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే కూర్చుని మద్యం తాగాలి. పబ్‌ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ మద్యంతోపాటు డ్యాన్స్‌లు, మ్యూజిక్‌ వంటి ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి.

లాంజ్‌ ఎలా ఉంటుందంటే..
లాంజ్ కూడా పబ్ లాగానే ఉంటుంది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, కూర్చోవచ్చు. అలాగే లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. బార్ కంటే కూడా ఎక్కువ సమయం గడపడానికి ఇక్కడ అనుమతి ఉంటుంది. బార్‌లలో ఐతే డ్రింకింగ్‌ తర్వాత ఎక్కువసేపు కూర్చోవడానికి అనుమతి ఉండదు. అనేక బార్‌లు, పబ్‌లలో ప్రవేశానికి ఫీజులు కూడా వసూలు చేస్తారు.

క్లబ్‌లో ఏవిధమైన సర్వీసులుంటాయంటే..
క్లబ్‌లు విశాలంగా ఉంటాయి. వీటిల్లో డ్యాన్స్ ఫ్లోర్ లేదా డ్యాన్స్ స్టేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ డ్రింక్‌ని ఆర్డర్ చేయవచ్చు లేదా కౌంటర్‌లో తీసుకోవచ్చు. ఐతే క్లబ్‌లలో ప్రవేశానికి ఎంట్రీ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. ఎక్కువ మంది క్లబ్‌లలో గడపడానికి ఇష్టపడతారు.

Also Read:

CIPET Recruitment 2022: సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో టీచింగ్ ఉద్యోగాలు