ఒకప్పటి రోజుల్లో సమాచారం ఇతరులకు చేరవేయాలంటే అంతా ఉత్తరాలతోనే పని. అయితే కాలానుగుణంగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ సహాయంలో క్షణాల్లో పనులు జరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే ఫోన్ కాల్, మెసేజింగ్, మెయిల్ ఇలా పలు రకాలుగా సమాచారాన్ని ఇతరులకు తెలియజేయగలుగుతున్నాం. అయితే ఏ సమాచారమైన ఇతరులకు తెలియజేయడానికి మహా అయితే గంట సమయం ఎక్కువ. ఫోన్ కాల్ చేసి.. విషయం చెప్పేసి కాల్ కట్ చేసేస్తాం. అంతే కదా.. ఏదైనా ప్రత్యేక సందర్భం అయితే రెండు, మూడు గంటలపాటు ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. ఇలా ఏదో ఒక సందర్భంగా అందరూ చేసే ఉంటారు. కొంతమంది తమ స్నేహితులతో, మరికొందరు వారి కుటుంబ సభ్యులతో లేదా వారి ప్రేమించిన వారితో సుదీర్ఘ సంభాషణలు చేస్తారు. గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడే వారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా ఎవరైనా ఫోన్ కాల్లో ఒకటి లేదా రెండు గంటలు మాత్రమే మాట్లాడగలరు.
అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఫోన్ కాల్ (వ్యక్తిగతంగా) ఎంతసేపు ఉందో తెలుసా..? హార్వర్డ్ యూనివర్శిటీకి చెందిన ఎరిక్ ఆర్. బ్రూస్టర్, అవరీ ఎ. లియోనార్డ్ ఏకంగా 46 గంటల 12 నిమిషాల 52 సెకన్ల పాటు ఒకరితో మరొకరు కాల్ మాట్లాడుకున్నారు. 2012లో నమోదైన ఈ కాల్.. అత్యంత పొడవైన ఫోన్ కాల్ రికార్డ్‌గా అయింది. కాల్ మాట్లాడినంత సేపు వీరిద్దరూ 10 సెకన్లకు మించి మౌనంగా లేరు. అయితే ప్రతి గంట తర్వాత వారు శక్తిని తిరిగి పొందడానికి ఐదు నిమిషాల విరామం ఇచ్చారు. వాస్తవానికి ఇది ఒక చిట్ చాట్ షో. అంతకుముందు 2009లో సునీల్ ప్రభాకర్ అత్యధిక సేపు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అతను దాదాపు 51 గంటల పాటు ఫోన్ కాల్లో మాట్లాడాడు. కానీ అతను వేర్వేరు వ్యక్తులతో కాల్ మాట్లాడాడు. ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత మరో వ్యక్తికి కాల్ ట్రాన్స్ఫర్ అయ్యేది.
@Heavvenn (Dan) The longest telephone conversation lasted 46 hours, 12 minutes and 52 seconds, by Avery Leonard and Eric Roff Brewster.
— Guinness World Records (@GWR) September 4, 2012
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..