AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలున్నాయా.? మీరు తోపులంతే..

శరీరంలో ఏయే చోట్ల పుట్టు మచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు. పుట్ట మచ్చల ఆధారంగా మనకు కలియో ప్రయోజనాలు, నష్టాలు ఎలాంటివో చెబుతుంటారు. ఇంతకీ పండితులు చెప్పే వివరాల ఆధారంగా శరీరంలో ఏయే చోట్ల పుట్టుమచ్చలు...

Moles on Body: ఈ ప్రాంతాల్లో పుట్టు మచ్చలున్నాయా.? మీరు తోపులంతే..
Mole On Body
Narender Vaitla
|

Updated on: Jan 26, 2024 | 3:36 PM

Share

చేతి గీతల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేసినట్లు ఒంటిపై ఉండే పుట్ట మచ్చల ఆధారంగా కూడా మన జీవితంలో జరిగే విషయాలను అంచనా వేయొచ్చని పండితులు చెబుతుంటారు. శరీరంలో ఏయే చోట్ల పుట్టు మచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించారు. పుట్ట మచ్చల ఆధారంగా మనకు కలియో ప్రయోజనాలు, నష్టాలు ఎలాంటివో చెబుతుంటారు. ఇంతకీ పండితులు చెప్పే వివరాల ఆధారంగా శరీరంలో ఏయే చోట్ల పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒకవేళ కుడి కనుబొమ్మ మీద పుట్టమచ్చ ఉంటే వారికి వివాహము త్వరగా అవుతుందని అర్థం.

* కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉంటే మంచి సంపద కలుగుతుంది. అలాగే వీరికి వాహన సౌఖ్యం ఉంటుంది.

* ముఖానికి కుడి వైపు పుట్టుమచ్చలు ఉండే పురుషులు అదృష్టవంతులని పండితులు చెబుతున్నారు. అదే ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయని శాస్త్రంలో తెలిపారు.

* ఇక పుట్టు మచ్చల మీద వెంట్రుకలు ఉన్న వారు ధనవంతులు, కీర్తివంతులు అవుతారని చెబుతున్నారు. అలాగే రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉండే మగవారికి దీర్ఘాయష్షు ఉంటుందని శాస్త్రంలో వివరించారు.

* మగవారి తలలో పుట్టు మచ్చ ఉంటే గర్వం ఎక్కువగా ఉంటుందని అర్థం. ఇలాంటి వారు ప్రతీ చిన్న అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారని చెబుతారు. ఒకవేళ నుదుటి మీద ఉంటే మంచి కీర్తి, ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి ఆర్థిక స్వతంత్రం ఎక్కువగా ఉంటుంది.

* ముక్కుపై పుట్టు మచ్చ ఉండే వారిలో క్రమశిక్షణ లోపిస్తుంది. అలాగే చెవివై పుట్టు మచ్చ ఉన్నవారికి ధనప్రాప్తి ఎక్కువని చెబుతుంటారు.

* పెదవిపై పుట్టు మచ్చ ఉన్నవారికి ఈర్ష్య భావన ఎక్కువగా ఉంటుదని, మరీ ముఖ్యంగా బంధువులు, స్నేహితుల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు.

* ఒకవేళ నాలుకపై పుట్టు మచ్చ ఉంటే వారు మంచి తెలివితేటలు కలిగిన వారని చెబుతారు. అలాగే వీరు మంచి విద్యా వంతులని శాస్త్రంలో పేర్కొన్నారు.

* ఇక గడ్డంపై పుట్టు మచ్చ ఉన్న పురుషులు ఉదార గుణము కలిగి ఉంటారు. అదే ఆడ వారైతే వారిలో భక్తి భావన ఎక్కువగా ఉంఉటది.

* భుజంపై పుట్టు మచ్చ ఉన్న వారు మంచి మర్యాదస్తులుగా ఉంటారు. కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలు శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..