సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి.. ముఖ్యంగా పాముల వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.. ప్రజలు కూడా అలాంటి వీడియోలనే చూడటానికి ఇష్టపడతారు. అయితే.. పాములు చాలా భయంకరమైన జంతువులు.. సరీసృపాల్లో భయంకరమైన జీవులు ఉన్నాయి.. పాములు కాటేస్తే నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది.. అందుకే.. సాధ్యమైనంత వరకు పాములకు దూరంగా ఉంటారు. అందుకే.. వీటికి సంబంధించిన వీడియోలను ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు.. దీనిద్వారా మనం ఇప్పటివరకు వినని, చూడని పాములను సోషల్ మీడియా ద్వారా చూడడంతోపాటు ఆ పాముల గురించి మరింత సమాచారం కూడా తెలుసుకోవచ్చు. వాస్తవానికి పాము అని చెప్పగానే అందరి గుండెల్లో ఒక రకమైన వణుకు పుడుతుంది. దాన్ని చూస్తే పరిగెత్తడమే.. ఇంకో మాటంటూ ఉండదు.. అయితే.. అలాంటి ఓ పాముకు సంబంధించిన ప్రమాదకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ వీడియోలో పాము చాలా కోపంగా ఉంది. చూస్తుంటే.. ఇది అత్యంత విషపూరితమైన పాములా కనిపిస్తుంది..
కింగ్ కోబ్రా.. వాస్తవానికి ఇది అత్యంత విషపూరితమైన పామే.. ఇది కాటు వేయడంతోపాటు విషాన్ని చిమ్ముతుంది.. ఇది విషాన్ని రెండు లేదా మూడు మీటర్ల దూరం చిమ్మగలదు.. ఆఫ్రికాలో కనిపించే ఏడు కోబ్రా రకాల్లో నాలుగు.. ఆసియాలో కనిపించే తొమ్మిదిలో ఏడు విషాన్ని చిమ్మగలవు. ఇవి సాధారణంగా రక్షణ కోసం చిమ్ముతాయి.. అంతేకాకుండా కాటు వేసే సమయంలో కూడా విషాన్ని చిమ్మగలవు.. అత్యంత ప్రాణాంతకమైన మాంబాస్, క్రైట్స్, కోబ్రాస్, వైపర్స్ లాంటివి విషాన్ని చిమ్ముతాయని వైద్యులు చెబుతున్నారు.
పాము విషం ప్రత్యర్థి శ్వాసను నిలిపివేస్తుంది. కొన్ని పాములు కాటువేయడంతోపాటు.. విషాన్ని కూడా చిమ్ముతాయి. ఆ విషం గాలితో శరీరంలో చేరినా మరణం ఖాయమంటున్నారు నిపుణులు.. అన్ని సమయాల్లో మరణం సంభవించదని.. శరీరంలో లోపలికి చేరుకుంటేనే ప్రమాదమంటున్నారు. వెనమ్ కాంటాక్ట్ వల్ల ఆ ప్రాంతంలో పొక్కులు లేదా అలెర్జీ లాంటివి ఏర్పడవచ్చు.. కానీ కంటి లోపలికి ప్రవేశిస్తే శాశ్వత అంధత్వానికి కారణం కావచ్చంటున్నారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది కెమోసిస్, కార్నియల్ వాపుకు కారణం కావచ్చు. ఇంకా పింజర లాంటి పాముల విషాన్ని చిమ్మితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. విషాన్ని బట్టి చాలా రోజుల పాటు ఆనారోగ్యానికి గురవ్వడంతోపాటు.. ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు.
ఈ వీడియోలో డేంజరస్ పాము నోరు తెరిచి, విషాన్ని బయటకు చిమ్ముతుంది.. ఈ విషం గాలిలో చాలా దూరం వెళుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..