Chanakya Niti: ఈ నాలుగు లక్షణాలు ఉన్నవారి వద్ద లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది..శత్రువులు ఉండరు 

ఆచార్య చాణక్య అన్ని విషయాల గురించి తెలిసినవారు. గొప్ప పండితుడు., అందరికీ ఇది తెలుసు.  ఈయన  మంచి జీవిత శిక్షకుడు. నిర్వహణ గురువు కూడా.

Chanakya Niti: ఈ నాలుగు లక్షణాలు ఉన్నవారి వద్ద లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది..శత్రువులు ఉండరు 
Chanakya Niti

Updated on: Jul 24, 2021 | 9:59 PM

Chanakya Niti:  ఆచార్య చాణక్య అన్ని విషయాల గురించి తెలిసినవారు. గొప్ప పండితుడు., అందరికీ ఇది తెలుసు.  ఈయన  మంచి జీవిత శిక్షకుడు. నిర్వహణ గురువు కూడా. ఆచార్య చాణక్య తన జీవితంలోని చేదు,  మధురమైన అనుభవాల నుండి ఏది నేర్చుకున్నా.. చాణక్య నీతి గ్రంథంలో, దాని సారాన్ని ప్రజలకు చాలా తేలికగా చెప్పారు. ఆచార్య తన జీవితమంతా సన్మార్గంలో నడిచి ప్రజలకు సరైన మార్గాన్ని చూపించడం కొనసాగించాడు. ధరమ్ బద్ధ జీవితాన్ని ప్రజలు ఎలా జీవించాలో చెప్పారు.

ఆచార్య సామర్ధ్యాలను అతను ఒక సాధారణ పిల్లవాడిని ఎలా చక్రవర్తిగా చేసాడు అనేదాని నుండి తెలుసుకోవచ్చు. నేటికీ, చాణక్య నీతిలోని ఆచార్య విధానాలను అనుసరించడం ద్వారా ప్రతి వ్యక్తి తన జీవితాన్ని సులభతరం చేయవచ్చు. చాణక్య నీతిలో, ఆచార్య అటువంటి నాలుగు లక్షణాల గురించి చెప్పాడు. ఒక వ్యక్తి నిజాయతీగా ఉంటె అతనికి ఎప్పుడూ డబ్బు లోటు ఉండదు లేదా అతను ఎప్పుడూ ఎవరికి  శత్రువు కాడు అని చెబుతారు ఆచార్య.

1. ఆచార్య చాణక్య తమ పని పట్ల కష్టపడి, నిజాయితీగా ఉన్నవారు, వారు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారని నమ్మారు. అలాంటి వారు తమ కృషితో తమ అదృష్టాన్ని సాధించుకుంటారు. వారు పేదవారైనా, చాలా త్వరగా పేదరికం నుండి బయటపడతారు.

2. ఈ ప్రపంచంలో భగవంతుడిని విశ్వసించే వ్యక్తి ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి చర్యకు శిక్షను భరించాల్సి ఉంటుందని అతనికి తెలుసు, కాబట్టి అతను పాపాలకు దూరంగా ఉంటాడు. అలాంటి వారు మంచి పని మాత్రమే చేస్తారు. గౌరవం పొందుతారు. వీరికి అందరూ  శ్రేయోభిలాషులే అవుతారు.

3. తమ పని పట్ల శ్రద్ధ చూపేవారు, అనవసరమైన విషయాలలో సమయం వృథా చేయరు. ఇతరుల వివాదాల్లో చిక్కుకోరు. అలాంటి వారికి శత్రువులు ఉండరు. అలాంటి వారు ఏదైనా విషయాన్ని చాలా ప్రశాంతంగా పరిష్కరించుకోవటానికి ఇష్టపడతారు. వారి ఈ అలవాటు అన్ని సమస్యల నుండి వారిని రక్షించడమే కాక, వ్యర్థమైన డబ్బు ఖర్చు నుండి కూడా వారిని కాపాడుతుంది.

4. ప్రతి పరిస్థితిలో అప్రమత్తంగా ఉన్నవారు, ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటారు. అలాంటి వారు వర్తమానంలో నివసిస్తారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేస్తారు. వర్తమానంలో కష్టపడి పనిచేయడం ద్వారా వారి భవిష్యత్తు కూడా సురక్షితం అవుతుంది.

Also Read: Chanakya Niti: వీటికి ఎటువంటి పరిస్థితిలోనూ కాలు తాకనీయవద్దని చెబుతారు ఆచార్య చాణక్య.. ఎందుకో తెలుసా?

Chanakya Niti: భర్తలు తమ భార్యలకు చెప్పకూడని నాలుగు విషయాలు ఏమిటో తెలుసా? ఆచార్య చాణక్య చెప్పింది ఇదే!