
Chanakya Niti: ఆచార్య చాణక్య గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈయన తన కాలంలో వెల్లడించిన విషయాలు.. ప్రపంచంలో ఎప్పుడూ నిత్యనూతనాలే. ముఖ్యంగా ఒక మనిషి నడవడిక ఎలా ఉండాలి అనే విషయంలో ఆచార్య చాణక్య చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ ఆచరణాత్మకంగానే ఉంటుంది. చాణక్య మనిషి ఎలా ఉండాలో చెప్పారు. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో వివరించారు. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రతిస్పందించాలో స్పష్టం చేశారు. స్నేహం ఎవరితో చేయాలి? శత్రుత్వం ఎవరితో ఉండకూడదు? అంతెందుకు పుట్టిన దగ్గరనుంచీ మరణం వరకూ ఒక మనిషి తన ప్రతి జీవన దశలోనూ ఎలా వ్యవహరించాలో విస్పష్టంగా బోధించారు ఆచార్య చాణక్య. ఇప్పుడు మనిషిలో కోపం గురించి.. శత్రుత్వం విషయంలో ఆయన సూచనల గురించి తెలుసుకుందాం.
కొంతమందికి చాలా కోపం వస్తుంది. అదీ ఒక్కోసారి చాలా త్వరగా. ప్రజలు ఎవరితోనైనా కోపం తెచ్చుకుంటారు. కోపం వచ్చినపుడు ఒక్కోసారి కొంతమంది ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలీదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం కొందరికి చాలా కష్టమైన విషయం. ఆ వ్యక్తి ఎంత మంచివాడైనా కానీండి. ఒక్క కోపం అనే కారణంతో అందరితో విరోధం వచ్చేస్తుంటుంది. అప్పటివరకూ దగ్గరగా ఉన్న స్నేహితులు కూడా అకస్మాత్తుగా శత్రువుగా మారిపోతుంటారు. అయితే, ఆచార్య చాణక్య కోపం తగ్గించుకోవడంతొ పాటు ఎటువంటి పరిస్థితుల్లోనూ నలుగురితో మాత్రం శత్రుత్వం పనికిరాదని చెప్పారు. ఈ నలుగురితో శత్రుత్వం జీవితాన్ని నాశనం చేసేస్తుందని చాణక్య స్పష్టంగా చెప్పారు. ఈ వ్యక్తులతో శత్రుత్వం రాకుండా కచ్చితంగా జాగ్రత్త పదాలని చెప్పారు ఆచార్య చాణక్య. ఇంతకీ చాణక్యుడు చెప్పిన ఆ నలుగురు ఎవరు?
1. ఆచార్య చాణక్య ఇలా అంటాడు, రాజుతో లేదా ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులతో వాదించకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడటం అంత సులభం కాదు. ఒకవేళ అలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడితే అది తీవ్రమైన కష్టాలకు దారితీస్తుంది. అది అటువంటి వ్యక్తి యొక్క జీవితమంతా నాశనం చేస్తుంది.
2. కొంతమంది వ్యక్తులు చాలా ప్రతికూల ప్రవర్తన కలిగి ఉంటారు. వారు తమను తాము చాలా తక్కువగా భావించుకుంటారు. తమని తాము దేనికీ అర్హులం కాము అని అనుకునే వ్యక్తులతొ స్నేహం కూడా శత్రుత్వం లాంటిది. అటువంటి వారితో బంధం కలిగి ఉండకపోవడమే మంచింది. వారు తమ ప్రతికూల వ్యక్తిత్వాన్ని తమ ఎదుటి వారికి ద్రోహం చేసే విధంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది.
3. మీ కంటే బలంగా ఉన్న వారితో ఎప్పుడూ వాదించకండి. అటువంటి వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు, డబ్బు వృధా అవుతుంది. అదేవిధంగా మీ జీవితం ప్రమాదంలో పడుతుంది.
4. ఏదైనా పండితుడిని లేదా బ్రాహ్మణుడిని అగౌరవపరచడం గొప్ప పాపం. అలా చేసే వ్యక్తి జీవితమంతా పాడైపోతుంది. అందువల్ల, ఏ పండితుడిని లేదా బ్రాహ్మణుడిని పొరపాటున అగౌరవపరచకూడదు.
Also Read: Chanakya Niti: ఈ ఐదు విషయాలు నమ్మదగినవి కావు, అవి ఎప్పుడైనా మనిషిని మోసం చేయగలవని చెప్పిన చాణిక్యుడు