Chanakya Niti: చాణక్య నీతి.. ఆ మూడు లక్షణాలు ఉన్న స్త్రీ కుటుంబంతో పాటు సమాజానికీ నాయకురాలు అవుతుంది!

|

May 14, 2021 | 5:17 PM

Chanakya Niti about woman: గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త అలాగే ఆర్థికవేత్తగా పిలువబడే ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధుల గురించి, ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Chanakya Niti: చాణక్య నీతి.. ఆ మూడు లక్షణాలు ఉన్న స్త్రీ కుటుంబంతో పాటు సమాజానికీ నాయకురాలు అవుతుంది!
Chanakya Niti About Woman
Follow us on

Chanakya Niti about woman: గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త అలాగే ఆర్థికవేత్తగా పిలువబడే ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధుల గురించి, ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. మనిషిలోని లోపాలు.. నాయకులుగా ఎదగాలంటే ఎటువంటి లోపం ఉండకూడదు? ఎలా ప్రవర్తించాలి? వంటి విషయాలను చాణక్య నీతి చక్కగా వివరిస్తుంది. ప్రతి అంశం గురించి స్పష్టంగా వివరించిన ఆపుస్తకంలోని ప్రతి మాటా ఇప్పుడు మనకు దారి చూపించేదిగానే ఉంటుంది.

ఆచార్య చాణక్య చెప్పిన ఈ విషయాలను ఎవరైనా పరిశీలిస్తే, వివిధ రకాలైన మానవుల మనస్తత్వాలను గుర్తించడం అంత కష్టం కాదు. ఒక వ్యక్తి తనకు మంచి జీవిత భాగస్వామి, బెస్ట్ ఫ్రెండ్ వంటి సంబంధాలను తనకు తానుగా ఎంచుకోవచ్చు. ఆచార్య చాణక్య మహిళలకు ఉండే ఒక మూడు లక్షణాలు ఆమెను ఉన్నతంగా నిలబెడతాయి అని చెబుతారు. అటువంటి లక్షణాలు ఉన్న భార్య దొరికితే ఆ పురుషులు అదృష్టవంతులు అని చెప్పారు. అటువంటి వారితో జీవన పయనం ఏ ఇబ్బందీ లేకుండా సాగిపోతుంది అని వివరించారు. అవేమిటో చూద్దాం..

1. వినయం..దయ

వినయం అలాగే, దయ అనే రెండు లక్షణాలను కలిగి ఉన్న స్త్రీకి సమాజంలో గౌరవం లభించడమే కాకుండా, తన కుటుంబానికి సరైన దిశను ఇస్తుంది. ఆమె కుటుంబం యొక్క అన్ని సంబంధాలను సవ్యంగా ఉంచడంలో భర్తకు సహకరిస్తుంది. అదేవిధంగా పిల్లలకు మంచి విలువలు నేర్పించడం ద్వారా వారిని మెరుగైన దారిలో నడిపించి సమాజానికి మంచి పౌరులను అందిస్తుంది.

2. మతాన్ని అనుసరించడం..

మతాన్ని..అనుసరించే స్త్రీ, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకుంటుంది. అటువంటి స్త్రీ యొక్క ధోరణి ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది. ఆమె ఎప్పుడూ తన విధుల నుండి తప్పుకోదు. అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది. అలాంటి స్త్రీ కుటుంబం మాత్రమే కాకుండా అనేక తరాలను తన నడవడికతో ప్రభావితం చేస్తుంది.

3. సంపద సంచితం

ఆచార్య చాణక్య సంపదను నిజమైన స్నేహితుడిగా అభివర్ణించారు. చెడు సమయాల్లో మిమ్మల్ని ఆడుకునే స్నేహితుడు ఇది అని ఆచార్య చాణక్య అంటారు. సంపదను నిల్వ చేసే అలవాటు ఉన్న స్త్రీ, ఆమె మొత్తం కుటుంబానికి రక్షకురాలు అవుతుంది. సమయానికి ముందే వచ్చే పరిస్థితులను అంచనా వేయగల సామర్థ్యం ఆమెకు ఉంటుంది. అటువంటి మహిళ భార్యగా దొరికితే ఎటువంటి వారైనా సంక్షోభ సమయాలను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతారు.

Also Read: ఎండాకాలం ఇంట్లోనే ‘చాక్లెట్ షేక్’ చేయండి..! ఒక్కసారి టేస్ట్ చేసారంటే అస్సలు వదలరు.. ట్రై చేయండి..

Publicity: ప్రచారం ఎదురు తన్నింది.. మోకాలి లోతు నీటిలో డొమినో పిజ్జా డెలివరీ.. ట్విట్టర్ లో పోస్ట్.. విమర్శిస్తున్న నెటిజన్లు!