Pregnancy: గర్భిణీలు హెయిర్ కట్ చేసుకుంటే.. శిశువు కళ్లపై ప్రభావం పడుతుందా.?

గర్భిణీలకు సంబంధించి ఎన్నో అపోహలు ఉంటాయి. అయితే వీటిలో కొన్ని నిజాలు ఉంటే, మరికొన్ని అపోహలు మాత్రమే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ అపోహే.. గర్భినీలు హెయిర్ కట్ చేసుకోవచ్చా.? నిజానికి గర్భిణీలు హెయిర్ కట్ చేసుకోవడం మంచిదేనా.? ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

Pregnancy: గర్భిణీలు హెయిర్ కట్ చేసుకుంటే.. శిశువు కళ్లపై ప్రభావం పడుతుందా.?
Pregnancy Women

Updated on: Oct 25, 2024 | 4:10 PM

మన భారతీయుల్లో ఎన్నో విశ్వాసలు ఉంటాయి. ముఖ్యంగా గర్బం దాల్చిన సమయంలో మహిళల విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత ఏ చిన్న పని చేయాలన్నా మహిళలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి హెయిర్ కట్‌ చేసుకోవడం. గర్భిణీలుగా ఉన్న సమయంలో మహిళలు హెయిర్‌ కట్‌ చేసుకోవచ్చా.? దీని చుట్టూ ఉన్న అపోహలు ఏంటి? వాటిలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణీలు వ్యాక్సింగ్‌ చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్బం దాల్చిన సమయంలో మహిళల్లో హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఇవి వారి చర్మంపై ప్రభాం చూపుతాయి. ఈ కారణంగానే గర్బందాల్చిన సమయంలో వ్యాక్సింగ్ చేసుకుంటే స్కిన్‌ ర్యాషెస్‌, మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భం దాల్చిన సమయంలో స్కిన్‌ సెన్సిటీవ్‌గా మారుతుంది. దీంతో వ్యాక్సింగ్‌ వల్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి.

ఇక గర్భిణీలు హెయిర్‌ కట్ చేసుకోవడం తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. ముఖ్యంగా ప్రెగ్నన్సీ సమయంలో జుట్టు కత్తిరించడం వల్ల బిడ్డ కళ్లు దెబ్బతింటాయనే ఓ అపోహ చాలా మందిలో ఉంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. జుట్టు కత్తిరించుకోవడానికి, శిశువు కళ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.

కాకపోతే సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో హార్మోన్ ఇన్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. అప్పటికే జుట్టు రాలడం, పెళుసుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ఈ సమయంలో హెర్‌ కట్ చేసుకోవడం వల్ల వాల్యూమ్ పూర్తిగా తగ్గుతుంది. ఇక డెలివరీ తర్వాత జుట్ట రాలిపోతుంది. కాబట్టి గర్భిణీలు జుట్టు కట్ చేసుకకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషాయలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ లేదని రీడర్స్‌ గమనించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..