
Viral video: కష్టం వస్తే కన్నవాళ్ళ తరవాత కనిపించే స్నేహితులు మాత్రమే.. స్నేహం మనుషుల మధ్యే కాదు…మూగజీవాల్లోనూ ఉంటుంది. మనిషి తన మిత్రుడి కోసం ప్రాణాలు ఫణ్ణంగా పెడతాడో లేదో తెలియదు గానీ, మూగజీవాలు మాత్రం తమ తోటి జీవికోసం ఎంతటి సాహసానికైన తెగిస్తాయనటానికి ఈ వీడియోనే ఓ నిదర్శనం..
హాయిగా పడుకుని సేదతీరుతున్న ఓ బఫెల్లో మీదకు ఉన్నట్టుండి ఓ సింహం దడి చేసింది. వెనక నుంచి ఒక్కసారిగా ఆ గేదె పైకి దూసుకువచ్చింది ఓ సింహం. దూరం నుంచే అది గమనించిన తోటి గేదె ఒక్క గెంతున ఆ సింహాం మీదకు దూకింది. దాని వాడియైన కొమ్ములతో సింహాన్ని అమాంతం ఎత్తికుదిపేసింది. అంతేకాదు..మరోమారు ఆ గేదె తన కొమ్ములతో సింహన్ని పైకిలేపి నేలకేసి కొట్టింది. ఆ మృగరాజు గాల్లో ఎగిరిపడాల్సి వచ్చింది. అక్కడ ఏంజరుగుతుందో సింహానికి అర్ధంకాలేదు. కాసేపటికి తేరుకున్న మృగరాజు.. బతుకు జీవుడా అనుకుని… అక్కడ్నుంచి పరుగులుపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎప్పటిదో అయినా నిజమైన స్నేహానికి ఆదర్శంగా నిలిచిన ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. స్నేహమంటే ఇదేరా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు గేదె ధైర్యాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో పై మీరువులుక్కెయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Gangubai Kathiawadi : ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చారు..
Kavita Kaushik: బిగ్ బాస్ వల్ల నా కెరియర్ నాశనం అయ్యింది.. సంచలన కామెంట్స్ చేసిన నటి
Trivikram Srinivas: కరోనాను జయంచిన మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ కు నెగిటివ్ గా నిర్ధారణ