Photo puzzle: రండి లెక్క తేల్చుకుందాం.. ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?

|

Nov 21, 2022 | 3:55 PM

పజిల్స్ అంటే మీకు ఇష్టమా..? చిక్కు ప్రశ్నలు సాల్వ్ చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగుతారా…? అయితే మీ కోసమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్.

Photo puzzle: రండి లెక్క తేల్చుకుందాం.. ఇక్కడ ఎన్ని పప్పీస్ ఉన్నాయో చెప్పలగలరా..?
Photo Puzzle
Follow us on

చిత్రం భళారే విచిత్రం.. మీ ముందుకు ఓ మాయ చేసే ఇమేజ్‌తో వచ్చేశాం. ఇది  ఫోటో పజిల్. మీ కళ్లలో తీక్షణత ఏ స్థాయిలో ఉంది.. మీ బుర్ర ఏ మాత్రం యాక్టివ్‌గా పనిచేస్తుందో.. ఇలాంటి పజిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. కొందరు తమ జీవితాల్లో చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంటారు. ఎలాంటి సమస్యలు వచ్చినా.. తప్పించుకోకుండా.. వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగుతుంటారు. తమ లైఫ్‌కి కొత్త డెఫినెస్ ఇస్తూ.. చాలామందిని ఇన్‌స్పైర్ చేస్తుంటారు. అలాంటివారు ఇలాంటి పజిల్స్ సోషల్ మీడియాలో కనిపించినప్పుడు కూడా అస్సలు వెనక్కి తగ్గరు. దాని లెక్క తేల్చేవరకు కుదురుగా ఉండరు. ఒక్కోసారి కాస్త లేట్ అయినా పక్కా సొల్యూషన్ పట్టేస్తారు.

తాజాగా మీ కోసం ఓ క్యూట్ ఫోటో పజిల్ తీసుకొచ్చాం. ఇది ఒరిజినల్‌గా తీసిన ఫోటో. ఒక చిన్న తొట్టిలో రోజుల వయస్సున్న ముద్దుముద్దైన పప్పీలను పెట్టారు. అవి ఒకదానిపై ఒకటి పడుకుని నిద్రపోతూ ఉన్నాయి. వాటి సంఖ్య ఎంతో మీరు చెప్పాలి. అదే టాస్క్. ఒక నిమిషంలోపల అక్కడ ఉన్న కుక్క పిల్లల సంఖ్య ఎంతో చెప్పేస్తే మీరు తోపు అంతే. చాలా ఫోకస్‌ పెట్టి చూస్తే.. సమాధానం ఈజీగానే కనిపెట్టవచ్చు.

ఆన్సర్ మీరు గుర్తిస్తే ఓకే. ప్రయత్నించి విఫలమైనవారు నో వర్రీస్. ఆన్సర్ ఉన్న ఇమేజ్ మేం దిగువన ఇస్తాం. మీరు ఎట్‌లీస్ట్ ట్రై చేశారు అది గొప్ప విషయమే. కానీ కనీస ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రం.. మీరు లేజీ ఫెల్లోస్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఏదైతేనేం.. ఈ పజిల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరో క్రేజీ పజిల్‌తో నెక్ట్స్ టైం కలుస్తాం. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే.. అక్కడ 10 పప్పీస్ ఉన్నాయ్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..