మీరు ఉదయం లేవగానే ఏం చేస్తున్నారు..? ఉదయం నిద్రలేవగానే మీరు చేసే మొదటి పనిని గుర్తుంచుకోండి..? మీరు కళ్ళు తెరిచిన వెంటనే మీరు చేసే మొదటి పని ఏంటి? మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్ర లేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. రాత్రంతా ప్రశాంతంగా పడుకొని.. ఉదయం ఫ్రెష్‌గా నిద్రలేస్తే.. రోజంతా ఫ్యాపీగా గడిచిపోతుంది. అయితే మనకు తెలిసో.. తెలియకో.. ఉదయం నిద్రలేవగానే కొన్ని తప్పులు చేస్తుంటాం. చాలా మంది నిద్ర లేవగానే అదే పని చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు.. మీరు కూడా అదేపని చేస్తున్నారా.. ఒక్కసారి మీ దినచర్య గురించి ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా మంది ప్రజలు మొదట మన ఫోన్ చెక్ చేసుకుంటామని అంటారు. ఇలాంటి సమధానం చెప్పేవారి సంఖ్య 80 నుంచి 90 శాతం ఉంటుంది. మిగిలిన 10 శాతం మంది ప్రజలు వచ్చిన వెంటనే నేరుగా బాత్రూమ్‌కు వెళతామని అంటారు.
అయితే మరికొందరు నిద్ర లేవడంతోనే పక్కనే ఉన్నవారితో ముచట్లతో పడిపోతుంటారు. అలా కొనసాగింపుగా అలా.. అలా తిరిగేస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు అని అంటారు. ముందుగా నోటిని శుభ్రం చేసుకున్న తర్వాతే మిగిలిన పనులు చేయాలని అంటున్నారు నిపుణులు.
నిద్ర లేవగానే ఫోన్ ఎందుకు చెక్ చేసుకోకూడదు?
మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ఫోన్‌ని చెక్ చేస్తే.. మీరు మీ మెదడు కొంత ఇబ్బందికి గురవుతుంది. అంటే, మీ మెదడు రోజువారీ జీవితానికి సంబంధించి దృష్టి పెట్టాలనుకునే విషయాలపై మీరు వాటి నుంచి మీ మెదడును ఇబ్బంది పెట్టినట్లుగా మారిపోతుంది. ఇలా చేయడం వల్ల మీ మెదడుపై పరోక్ష ఒత్తిడి ఏర్పడటం ప్రారంభమవుతుంది.
నిద్ర లేవగానే మాటల్లో పడొద్దంటే?
చాలా మంది నిద్ర లేంది మొదలు పక్కనే ఉండేవారితో ముచ్చట్లతో పడిపోతారు. ఇలా మాటల్లో పడిపోయిన తర్వాత బ్రెష్ చేయడాన్ని పక్కనే పెట్టేస్తారు. ఇంట్లో అటూ ఇటు తిరుగుతుంటారు. దీని వల్ల వారి ఆరోగ్యం చెడిపోతుంది. నోటిలోని పాచి అలానే లోపలికి వెళ్లిపోతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు మొదలవుతాయి. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేవగానే మీ అరచేతులను చూడాలి. ఎందుకంటే వ్యక్తి అదృష్టం వారి అర చేతుల్లోనే దాగి ఉంటుందట. ఆ తర్వాత మాటల్లో పడకుండా నేరుగా బ్రేష్ చేసుకుంటే రోజంతా ష్రెష్‌గా ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం