Apple Store: యాపిల్ సంస్థ ప్రోడక్ట్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంది. భారత్‌లో ఆ సంస్థ ఫోన్లు, ఇతర వస్తువులకు విపరీతమై డిమాండ్ ఉందనే విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాపిల్ సంస్థ భారత వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యాపిల్ స్టోర్‌లో రూ. 44,900, అంతకు మించి కొనుగోలు చేసిన వారికి భారీ ఎత్తున క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 44,900లకు పైన కొనుగోలు చేసే వారికి రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 21 నుంచి ప్రారంభమై 28వ తేదీతో ముగుస్తుందని యాపిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అయితే, ఈ ఆఫర్ హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ ఈఎంలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌కు అర్హులైన వినియోగదారులకు.. ప్రోడక్ట్ డెలివరీ అయిన తరువాత వారం రోజుల్లో క్యాష్ బ్యాక్ అవుతుందని చెప్పారు. ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో పాటు.. నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు కూడా కల్పించారు. గరిష్టగా ఆరు నెలలు ఈఎంఐ సెలక్ట్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ సంస్థ తెలిపింది.
Also read: