AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదు సందర్భాల్లో నిశ్శబ్దంగా కూర్చోవడమే బెటర్..! చాణక్యుడి హెచ్చరిక ఇదే

Chanakya quotes, Life lessons: ఆచార్య చాణక్యుడు మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కరం చూపించారు. మనిషి ఏ పరిస్థితిలో ఎలా ఉండాలనేదానిపైనా వివరించారు. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, లేదా కొన్ని చోట్ల మౌనంగా ఉండటం మీకు మంచిది, లేకుంటే మీరు చాలా నష్టపోవచ్చు, కొన్ని సందర్భాల్లో మరణించవచ్చు అని చాణక్యుడు హెచ్చరించారు.

Chanakya Niti: ఈ ఐదు సందర్భాల్లో నిశ్శబ్దంగా కూర్చోవడమే బెటర్..! చాణక్యుడి హెచ్చరిక ఇదే
Chanakya Niti
Rajashekher G
|

Updated on: Feb 04, 2026 | 7:43 PM

Share

భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు జీవితంలో మనుషులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆయన చెప్పిన సూత్రాలు నేటికీ ఆచరణీయంగా ఉండటం గమనార్హం. చాణక్యుడు తన చాణక్యుడి నీతి అనే పుస్తకంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా ప్రవర్తించాలో చాలా విషయాలు చెప్పాడు. చాణక్యుడి ఈ ఆలోచనలు నేటికీ ఉపయోగకరంగా ఉన్నాయి, అవి జీవితంలో మార్గదర్శి పాత్రను పోషిస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో తరచుగా కఠిన పరిస్థితులు సంభవిస్తాయని.. అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో చాణక్యుడు చెబుతున్నాడు. మీ జీవితంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు భయపడకుండా.. అన్ని పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడే మీకు ఏది సరైనది? ఏది తప్పు? దీన్ని నిర్ణయించుకుని తదనుగుణంగా ముందుకు వెళ్లండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అని చాణక్యుడు స్పష్టం చేశాడు. చాణక్యుడు ఏయే సందర్భాల్లో మనిషి మౌనంగా ఉండటం ఉత్తమమో తెలియజేశారు. దాని వల్ల అనేక ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.

కోపంగా ఉన్న వ్యక్తి..

మీరు కోపంగా ఉన్న వ్యక్తిని ఎదుర్కొన్నప్పుడు.. ప్రశాంతంగా ఉండండి అని చాణక్యుడు చెప్పాడు. మీరు ప్రశాంతంగా ఉంటే, అవతలి వ్యక్తి కోపం కూడా తగ్గుతుంది. భవిష్యత్తులో వచ్చే అన్ని దురదృష్టాలు నివారించబడతాయి. అలా కాకుండా మీరూ ఆవేశపడితే జరగరాని అనర్థాలు జరుగుతాయి.

ప్రతికూల పరిస్థితులు..

మీ జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అటువంటి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా మొత్తం పరిస్థితిని గమనించి, ఆపై నిర్ణయం తీసుకోండి అని చాణక్యుడు చెబుతున్నాడు. తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు అని హెచ్చరించారు.

అనారోగ్యం..

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఎక్కువ కష్టపడి పనిచేయవద్దని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే అది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి, మీ మరణానికి కూడా దారితీయవచ్చు. కాబట్టి మొదట అనారోగ్యం నుంచి కోలుకుని, ఆ తర్వాత మాత్రమే పని ప్రారంభించండి, అప్పటి వరకు, నిశ్శబ్దంగా కూర్చోండి.

మీకంటే శక్తివంతుడు..

మీ ముందు ఉన్న వ్యక్తి మీకంటే శక్తివంతుడు అయినప్పుడు, అటువంటి పరిస్థితిలో మౌనంగా ఉండటం ఉత్తమం అని చాణక్యుడు చెప్పాడు. అతనికి ఎదురుతిరగడం మీకు అంత మంచిది కాదని సూచిస్తున్నాడు.

బలమైన శత్రువు..

మీ శత్రువు బలంగా ఉన్నప్పుడు, అతనిని నేరుగా ఎదుర్కోవడం అవివేకమని, కాబట్టి ప్రతిదీ ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఏదైనా నిర్ణయం తీసుకోండి అని చాణక్యుడు చెప్పాడు. ఈ సందర్భాల్లో దొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందకు వెళ్లాలని సూచించాడు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)