Airtel New Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్.. ఈ ప్లాన్స్ తీసుకుంటే అమేజాన్ ప్రైమ్ సహా మరిన్ని ఓటీటీలు ఫ్రీ!

|

Apr 22, 2023 | 7:08 AM

Airtel Prepaid Plans: ప్రస్తుతం ఉన్న కస్టమర్ల సంతృప్తి, ఇతర టెలికాం యూజర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎయిర్‌టెల్ అనేక ప్లాన్స్ తీసుకువస్తోంది. సరికొత్త, చౌకైన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి ప్లాన్స్‌ ఎయిర్‌టెల్‌లో చాలానే ఉన్నాయి. అయితే కొన్ని ప్లాన్స్ మాత్రం డిస్నీ+హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్ వంటి..

Airtel New Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్.. ఈ ప్లాన్స్ తీసుకుంటే అమేజాన్ ప్రైమ్ సహా మరిన్ని ఓటీటీలు ఫ్రీ!
Airtel Plans
Follow us on

ప్రస్తుతం ఉన్న కస్టమర్ల సంతృప్తి, ఇతర టెలికాం యూజర్లను తమవైపు తిప్పుకునేందుకు ఎయిర్‌టెల్ అనేక ప్లాన్స్ తీసుకువస్తోంది. సరికొత్త, చౌకైన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్‌తో కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అలాంటి ప్లాన్స్‌ ఎయిర్‌టెల్‌లో చాలానే ఉన్నాయి. అయితే కొన్ని ప్లాన్స్ మాత్రం డిస్నీ+హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఫ్రీగా అందిస్తున్నాయి. ఆ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకుంటే యూజర్లు.. కాల్స్, మెసేజెస్, డేటాతో పాటు ఈ యాప్స్‌లో సినిమాలను కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ప్లాన్స్ ఏంటో వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిస్నీ+ హాట్‌స్టార్‌, అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న ప్లాన్స్ ఇవే..

రూ.499, రూ.839, రూ.3,359, రూ.699, రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్స్‌ ద్వారా కస్టమర్లకు ఈ ఓటీటీ యాప్స్‌ని అందిస్తోంది ఎయిర్‌టెల్. మొదటి మూడు ప్లాన్స్ అంటే.. రూ.499, రూ.839, రూ.3,359 తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఇక రూ. 499తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్‌లు, రోజుకు 3 జీబీ డేటా, 28 వ్యాలిడిటీ ఉంటుంది.

రూ.839తో రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 2జీబీ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.3,359 ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 2.5 జీబీ డేటా, 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాదండోయ్.. ఈ ప్లాన్‌లో ఎక్స్‌ట్రా అన్‌లిమిటెడ్ 5 జీబీ డేటా, అపోలో 24/7 సర్కిల్‌, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్‌, హలోట్యూన్స్‌, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలను కూడా ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్స్ అన్నింటిలో డిస్నీ+ హాట్‌స్టార్‌ మొబైల్‌ను మూడు నెలల వరకు వీక్షించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక ప్లాన్స్ రూ.699, రూ.999 లో అమేజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నాయి. వీటిలో మొదటి ప్లాన్ రూ.699 గురించి చూసుకుంటే.. 56 వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, డైలీ 3 జీబీ డేటా, 56 రెజుల పాటు అమేజాన్ ప్రైమ్ వీక్షించే వెసులుబాటు ఉంటుంది. రూ.999తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, 84 రోజుల వ్యాలిడిటీతో 84 రోజుల వరకు అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఇక ఈ రెండు ప్లాన్లలో ఎక్స్‌ట్రీమ్‌ యాప్‌, అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..