Air pollution: వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు

|

Jan 26, 2021 | 7:43 PM

రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో అనేక జీవరాశులు నశించిపోతున్నాయి. ఇప్పడు ఇది మావనజాతి మనుగడకే పెను ముప్పుగా మారుతోంది. మహమ్మారిలా మారుతున్న ఈ వాయు కాలుష్యం గర్భ విచ్ఛిత్తికి కారణమవుతోంది.

Air pollution:  వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు..  శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు
Follow us on

రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో అనేక జీవరాశులు నశించిపోతున్నాయి. ఇప్పడు ఇది మావనజాతి మనుగడకే పెను ముప్పుగా మారుతోంది. మహమ్మారిలా మారుతున్న ఈ వాయు కాలుష్యం గర్భ విచ్ఛిత్తికి కారణమవుతోంది. కడుపులో ఊపిరి పోసుకుంటున్న పసిగుడ్డుల ఉసురు తీస్తోంది. అనేక మంది తల్లులకు కడుపుకోత మిగుల్చుతోంది. భారత్ సహా దక్షిణాసియా దేశాల్లో 29శాతం అబార్షన్లకు కారణం వాయు కాలుష్యమేనని చైనాలోని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది.

2000–2016 మధ్య వాయు కాలుష్యం వల్ల ఏటా సగటున 3,49,681 అబార్షన్లు జరిగాయని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. ఈ కాలంలో ఏటా జరుగుతున్న అబార్షన్లలో వాయు కాలుష్యం వల్ల అవుతున్న అబార్షన్లు 7 శాతం చొప్పున పెరిగాయని నిర్ధారించారు. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశాల ప్రకారం కాలుష్య కారకమైన పీఎం 2.5 పరమాణువులు ఒక ఘనపు మీటరు గాలిలో 10 మైక్రోగ్రాములకు మించి ఉండకూడదు. అయితే, దక్షిణాసియా దేశాల్లో అది 40 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. 10 మైక్రోగ్రాములు దాటాక.. పెరిగే ప్రతి పాయింట్ కు 3 శాతం మేర అబార్షన్లు పెరుగుతున్నాయని తేల్చారు.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో అబార్షన్లు జరిగిన 34,197 మంది మహిళల డేటా తీసుకుని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. మన దేశంలోనే ఎక్కువగా 77 శాతం మేర వాయు కాలుష్యంతో గర్భ విచ్చిత్తులు జరిగాయని తేల్చారు. తర్వాత పాకిస్థాన్ లో 12 శాతం, బంగ్లాదేశ్ లో 11 శాతం మేర అబార్షన్లు అయ్యాయని గుర్తించారు.

Also Read:

Black Magic: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. వింత పూజల నేపథ్యంలో స్థానికుల్లో భయం, భయం

MLA Shankar Naik: రైతు కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఆశ్చర్యానికి గురైన స్థానికులు.. ఎందుకో తెలుసా..?