వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాస్తు అనేది కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. గదుల నిర్మాణంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలని చెబుతున్నారు.
ఇంట్లో చనిపోయిన పెద్దల ఫొటోలను పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫొటోలో విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. పూర్వీకుల ఫొటోలోను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని అంటున్నారు. ఇంతకీ ఆ నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూర్వీకుల ఫొటోలను పెట్టడానికి దక్షిణ దిశ మంచిదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. అందుకే చనిపోయిన వారి ఫొటోలను ఈ దిశలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే కొందరు పూజ గదిలో కూడా పూర్వీకుల ఫొటోలను పెడుతుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. కాబట్టి పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన వారి ఫొటోలను పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇక చనిపోయిన వారి ఫొటో విరిగిపోకుండా చూసుకోవాలి. అద్దం పగిలిన ఫొటోలను ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఫొటో ఫ్రేమ్ విరిగినా, పాడైపోయినా వెంటనే వెంటనే తొలగించి కొత్త ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చనిపోయిన ఒకే వ్యక్తికి సంబంధించిన ఎక్కువ ఫొటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఫొటోలను తూర్పుకు అభిముఖంగా పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దక్షిణ గోడకు ఏర్పాటు చేసి ఫొటో ఉత్తరం అభిముఖంగా ఉండడం బెస్ట్ అని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..