Aadhaar Card: ఈ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మీకు తెలుసా?.. పూర్తి వివరాలివే..

|

Sep 03, 2021 | 6:32 AM

Aadhaar Card: ఆధార్.. ఈ కార్డు లేనిదే ప్రస్తుతం ఏ పని జరుగని పరిస్థితి నెలకొంది. ఇది తప్పనసరి కానప్పటికీ.. అన్నింటికీ అవసరం పడుతుంది.

Aadhaar Card: ఈ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని మీకు తెలుసా?.. పూర్తి వివరాలివే..
Aadhaar
Follow us on

Aadhaar Card: ఆధార్.. ఈ కార్డు లేనిదే ప్రస్తుతం ఏ పని జరుగని పరిస్థితి నెలకొంది. ఇది తప్పనసరి కానప్పటికీ.. అన్నింటికీ అవసరం పడుతుంది. ఆధార్ వివరాలు నమోదు చేయకపోతే ప్రభుత్వ పథకాలు మొదలు.. అనేక అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న పని మొదలు పెద్ద పని వరకు అన్నింటికీ ఆధార్ అవసరం పడుతోంది. మొబైల్ సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా.. లోన్స్ తీసుకోవాలన్నా, పీఎఫ్ తీసుకోవాలన్నా.. ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలన్నా.. ఆధార్ వివరాలు తప్పనిసరి. ఆధార్ అనేది మీరు పేరు, పుట్టిన తేదీ, చిరునామా రుజువు మాత్రమే కాదు.. పూర్తి బయోమెట్రిక్ వివరాలు కలిగి ఉన్న అధికారిక డాక్యూమెంట్. ఆధార్ కార్డ్ అనే పూర్తి కేవైసీ. ఈ నేపథ్యంలో ఈ ఆధార్ కార్డ్ ముఖ్యంగా ఏ ఏ సేవలలో అవసరమో తెలుసుకుందాం..

1. వీసా-పాస్‌పోర్ట్ కోసం..
విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా అవసరం. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అత్యంత కీలక పత్రం ఆధార్ కార్డ్. మొదటిసారి పాస్‌పోర్ట్ పొందడానికి, పునరుద్ధరించడానికి ఆధార్ ఇవ్వడం తప్పనిసరి.

2. విద్య..
స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలలో ప్రవేశానికి సంబంధించిన అంశలోనైనా.. స్కాలర్‌షిప్ తీసుకునే అంశంలోనేనైనా ఆధార్ కార్డు అవసరం. అంతేకాదు.. నీట్ వంటి పోటీ పోటీ పరీక్షలకు కూడా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తింపు రుజువుగా ఆధార్ తప్పనిసరి డాక్యుమెంట్‌గా పరిగణించబడుతుంది. ఈ నియమం దేశంలోని చాలా విద్యాసంస్థలకు వర్తిస్తుంది.

3. బ్యాంకింగ్..
బ్యాంకింగ్ రంగంలో ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరి అయ్యింది. ఆధార్ లేకుంటే బ్యాంకింగ్ రంగంలో ఏ పని పూర్తికాని పరిస్థితి ఉంది. బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా.. రుణాలు తీసుకోవాలన్నా తప్పనిసరిగా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆధార్ వివరాలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది లేకుండా బ్యాంకింగ్ సెక్టార్‌లో ఏ పని కూడా సాధ్యం కాదు.

4. ఎల్‌పీజీ కనెక్షన్..
ఎల్‌పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్‌పీజీ తీసుకోవడానికి మీ గుర్తింపు. నివాస ధృవీకరణ కోసం ఆధార్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

5. పెన్షన్..
పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆధార్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షన్ ఖాతా తెరవడానికి, పెన్షన్ ఉపసంహరించుకోవడానికి ఆధార్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు.. అనేక పథకాల్లోనూ లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా మారింది.

6. రేషన్ దుకాణం..
పీడీఎస్ కింద నడుస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ పొందాలంటే మీ ఆధార్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే సబ్సిడీ ప్రయోజనాల్ని పొందుతారు. తృణధాన్యాల నుండి ఉప్పు వరకు, చక్కెర నుండి ఇతర ఆహార పదార్థాల వరకు సబ్సిడీ పొందాలంటే రేషన్ షాపులో ఆధార్ సమాచారం అందించాలి. ఇందుకోసం రేషన్ కార్డుకు ఆధార్ లింక్ చేస్తారు.

7. ప్రావిడెంట్ ఫండ్..
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వ్యక్తులు ప్రావిడెంట్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో, ప్రతి నెలా కొంత డబ్బు తీసివేయబడుతుంది, దానికి కొంత డబ్బు యాడ్ అయ్యి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ సమయంలో, ఈ డబ్బు పెద్ద ఖర్చులకు ఉపకరిస్తుంది. ఆధార్ కార్డును పీఎఫ్‌ తో అనుసంధానం చేసినప్పుడు మాత్రమే పీఎఫ్ ఫండ్‌లో డబ్బు జమ చేయబడుతుందని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రెండింటినీ యాడ్ చేయకపోతే పీఎఫ్ ఫండ్‌లో డబ్బు జమ చేయబడదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఉద్యోగులు, కంపెనీ పీఎఫ్‌లో డబ్బు జమ చేయలేరు.

Also read:

Ice Cream Tester: ఐస్ క్రీమ్ తినడమే ఇతని పని.. జీతం మాత్రం కోట్లతో.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..

Funny Samosa: ఇలాంటి సమోసాను మీ జీవితంలో చూసి ఉండరు.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోన్న ఫోటో..

Gold News: బంగారం కొనుగోలు చేస్తున్నారా?.. ఈ మూడు మార్కులను తప్పక చూడండి.. లేదంటే అంతే సంగతులు..