Viral: ఇందుకే కదా మాతృదేవోభవ అనేది.. కూతురిని పెంచేందుకు పురుషావతారం ఎత్తిన తల్లి..

|

May 14, 2022 | 1:10 PM

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఓ మహిళకు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త మరణించాడు. దీంతో తన కుమార్తెను ఎలాంటి బాధలు లేకుండా పెంచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తనో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Viral: ఇందుకే కదా మాతృదేవోభవ అనేది.. కూతురిని పెంచేందుకు పురుషావతారం ఎత్తిన తల్లి..
Women Disguised Herself
Follow us on

Mother’s Care: బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు తన జీవితాన్ని వారికి అంకితం చేసి, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేస్తుంటుంది. తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటుంది. వారి కోసం తనకు ఇష్టమైన వాటిని ఎన్నో వదిలేస్తుంటుంది. అందుకే అమ్మ అంటే అందరికి ఓ నమ్మకం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అమ్మ పక్క నుంటే ఆ ధైర్యమే వేరుగా ఉంటుంది. మనకు చిన్న దెబ్బ తగిలినా.. వెంటనే మన నోటి నుంచి వచ్చే పదమే అమ్మ.. అందుకే మాతృదేవోభవ అంటూ ప్రతిరోజు తలచుకుంటూ ఉంటాం. అయితే, ఇలాంటి కోవకే చెందిన ఓ అమ్మ గురించి.. కాదు..కాదు.. నాన్నలా మారిన అమ్మ స్టోరీని మనం తప్పక తెలుసుకోవాల్సిందే. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త మరణించడంతో, తన కుమార్తెను ఎంతో చక్కగా పెంచాలని నిర్ణయించుకుంది. వేధింపులకు దూరంగా తన కుమార్తెను ఉంచాలనుకుంది. ఈ క్రమంలో తనో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ జీవితం కోసం పురుషుడి అవతారం ఎత్తింది. అసలు ఇలా ఎందుకు చేసిందో తెలుసుకంటే షాకవుతారు..

మూడు దశాబ్దాల క్రితం తూత్తుకుడిలోని కటునాయకన్‌పట్టి గ్రామానికి చెందిన పెచ్చియమ్మాళ్ (20)కి పెళ్లయిన 15 రోజులకే భర్త గుండెపోటుతో మృతి చెందాడు. కానీ, అప్పటికే ఆమె గర్భం దాల్చింది. కొన్ని నెలల తర్వాత ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక బిడ్డను చక్కగా పెంచడం కోసం, పెచ్చియమ్మాళ్ పలు పనులు చేయడం ప్రారంభించింది. కానీ, పనిచేసే చోట వేధింపులను ఎదుర్కొంది. తన ఒక్కగానొక్క కూతుర్ని.. మళ్లీ పెళ్లి చేసుకోకుండా పెంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం పెచ్చియమ్మాళ్ పురుషావతారంఎత్తింది. ఈ క్రమంలో తను కేవలం రూపాన్ని మార్చుకుని ‘ముత్తు’గా మారింది.

రూపాంతరం..

ఇవి కూడా చదవండి

పురుషుడి రూపం కోసం ఆమె జుట్టును కత్తిరించి, లుంగీ, చొక్కా ధరించింది. ముత్తు గత మూడు దశాబ్దాలుగా చెన్నై, తూత్తుకుడిలోని హోటళ్లు, టీ దుకాణాలు వంటి అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆమె పనిచేసిన ప్రతిచోటా ‘అన్నాచి’ (మగవాడికి సాంప్రదాయ పేరు) అని పిలవడం ప్రారంభించారు.

పెచ్చియమ్మాళ్ నుంచి ‘ముత్తు మాస్టర్’ వరకు..

‘పెయింటర్‌గా, టీ మాస్టర్‌గా, పరోటా మాస్టర్‌గా, 100 రోజుల పని వరకు అన్ని రకాల ఉద్యోగాలు చేశాను. నా కుమార్తెకు భద్రత కల్పించేందుకు ప్రతి పైసా పొదుపు చేశాను. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ‘ముత్తు’ నా గుర్తింపుగా మారిపోయాడు. ఇది ఆధార్, ఓటర్ ID, బ్యాంక్ ఖాతాతో సహా అన్ని పత్రాలలో ఇలాగే ఉంది” అని ఆమె పేర్కొన్నారు.

ఇలా ఉండడం మొదట్లో చాలా కష్టమని ఆమె పేర్కొంది. “నా కూతురి భద్రతను దృష్టిలో ఉంచుకుని, నేను ఇబ్బందులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను. నా జీవనోపాధి కోసం నేను ఎక్కువ ప్రయాణాలు చేశాను. ఈ సమయంలో మారువేషంలో నన్ను నా పని ప్రదేశంలో సురక్షితంగా ఉంచుకోగలిగాను. నా గుర్తింపును నిజం చేయడానికి, నేను ఎల్లప్పుడూ బస్సుల్లో పురుషుల సీట్లల్లోనే కూర్చున్నాను. నేను పురుషుల టాయిలెట్‌ను కూడా ఉపయోగించాను. ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించినప్పటికీ, నేను ఛార్జీలు చెల్లించాను”అని ఆమె తెలిపింది.

నెరవేరిన ఆశలు..

57 ఏళ్ల పెచ్చియమ్మాళ్ ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ‘‘నా కూతురికి పెళ్లయింది. నా కోరికలన్నీ తీరిపోయాయి. నేను చనిపోయిన తర్వాత కూడా ఇలాగే గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి పింఛన్‌ రాకుంటే జీవితాంతం పురుషుడిలానే గడుపుతాను. అనేక పథకాలకు నేను అనర్హులుగానే ఉన్నాను’’ అని ఆమె అన్నారు.

ఆమె కష్టాల గురించి ఒకరిద్దరితోపాటు ఆమె కుమార్తె షణ్ముగసుందరికి మాత్రమే తెలుసు. “ఆమె తన జీవితాన్ని నా కోసం అంకితం చేసింది. ఆమెకు ఫించన్ లభిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని షణ్ముగసుందరి అన్నారు.

Also Read: Telangana: పేదలకు తీపికబురు.. రేషన్‌ షాపుల్లో మినీ సిలిండర్లు.. ఇవిగో వివరాలు..

Viral: పొట్టు పొట్టుగా చిరిగిన షూస్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.!