Viral Video: పశువుల కొట్టం నుంచి ఏవో చప్పుళ్లు.. కనిపించింది చూడగా పరుగో పరుగు..

ఓ రైతు తన పశువులకు మేత వేసేందుకు కొట్టంలోకి వచ్చాడు. ఇక అక్కడ ఏవో చప్పుళ్లు వినిపిస్తే.. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అని చూడగా.. అక్కడ కనిపించింది చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అక్కడ ఏం కనిపించిందో ఇప్పుడు చూసేద్దాం.

Viral Video: పశువుల కొట్టం నుంచి ఏవో చప్పుళ్లు.. కనిపించింది చూడగా పరుగో పరుగు..
Trending

Updated on: Jul 16, 2025 | 12:58 PM

మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఒక రైతు పశువుల కొట్టం నుంచి అరవై కోబ్రా పిల్లలు బయటపడ్డాయి. అత్యంత విషపూరితమైన ఈ పాముపిల్లలను చూసి గ్రామస్తులు భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే.. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పాములను సురక్షితంగా పట్టుకున్నాడు.

వాటిని ఓ పెట్టెలో పెట్టి.. ఆపై అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఏ హనీ జరగలేదు. ప్రస్తుతం కోబ్రా పిల్లలకు సంబంధించిన వీడియో నెట్టింట ఎవరికీ లేదా పాముకు ఎటువంటి హాని జరగలేదు. కోబ్రా పిల్లల భయానక వీడియో ఒకటి బయటకు వచ్చి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..