బామ్మ నోట బంగారం లాంటి పాట.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన 110 ఏళ్ల బామ్మ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

110 ఏళ్ల వయసులో ఓ బామ్మ అద్భుతంగా పాటపాడి అందరిని ఆశ్చర్యపరిచింది. 110 ఏళ్ల వయసేంటి, ఈ పాటేంటి అనుకుంటున్నారా.. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.

బామ్మ నోట బంగారం లాంటి పాట.. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన 110 ఏళ్ల బామ్మ.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

Edited By:

Updated on: Feb 04, 2021 | 7:15 AM

110 ఏళ్ల వయసులో ఓ బామ్మ అద్భుతంగా పాటపాడి అందరిని ఆశ్చర్యపరిచింది. 110 ఏళ్ల వయసేంటి, ఈ పాటేంటి అనుకుంటున్నారా.. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఒకే ఒక్క పాటతో ఈ బామ్మ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.యూకేలోని వేల్స్‌కు చెందిన ఎమి మాజీ నర్తకి. గత వారం ఆమె పాడిన హాల్ సాంగ్ ఆమెకు ఒక్కసారిగా గుర్తింపు తీసుకొచ్చింది.

గత ఆదివారం ఆమె 110వ ఏటా అడుగుపెట్టగా, ఆ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఎమి ఓ పాట పాడింది. దాన్ని ఆమె మనవడు టిక్‌టాక్‌లో షేర్ చేయగా అత్యధిక వ్యూస్‌‌తో దూసుకోపోతోంది. ఆమె తన 14వ ఏటా డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకోగా, ఒక నృత్య బృందంతో కలిసి ప్రదర్శనలు ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమీ హాకిన్స్ ఫైర్-వాచర్‌గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె దక్షిణ వేల్స్‌లోని మోన్‌మౌత్‌షైర్‌లోని తన నివాసంలో నాలుగు తరాల వారసులతో కలిసి సంతోష జీవనం గడుపుతోంది. ఈ సందర్బంగా ఆమె మనవడు మాట్లాడుతూ.. బామ్మ పాటను టిక్‌టాక్‌లో షేర్ చేయాలని నిర్ణయం ది బెస్ట్ అని అనుకుంటున్నానని చెప్పాడు. మా బామ్మకు టిక్‌టాక్ అంటే అర్థం కాదు, కానీ ఆమె ఒకే పాటతో సింగింగ్ సెన్సేషన్‌గా నిలవడం నిజంగా మాకు ఎంతో సంతోషాన్నిస్తోందని ప్రకటించాడు. ఇది ఆమెకు దక్కిన సూపర్ బర్త్ డే గిఫ్ట్‌గా మేము భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.