Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. విమాన రాకపోకలు రద్దు

Hong Kong grounds all flights as protest paralyzes airport, ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చిన నిరసనకారులు.. విమాన రాకపోకలు రద్దు

వరుస ఆందోళనలతో హాంకాంగ్ అట్టుడుకుతోంది. దీని ఎఫెక్ట్ అక్కడి విమాన రాకపోకల మీద కూడా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో హాంకాంగ్‌కు విమాన రాకపోకలను రద్దు చేస్తునట్లు హాంకాంగ్‌ విమానాశ్రయ అధికారులు సోమవారం తెలిపారు. వేలమంది నిరసనకారులు విమనాశ్రయాల్లోకి చొచ్చుకొని వస్తూ ఆందోళనకు దిగుతున్నారు. హాంకాంగ్‌ సురక్షితం కాదు, పోలీసు వ్యవస్థ తీరు బాగోలేదంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడంతా గందరగోళం నెలకొంది. ఈ సమయంలో ప్రయాణికులు సరైన సౌకార్యాలు కల్పించలేమంటూ విమానాశ్రయ వర్గాలు చేతులెత్తేశాయి. హాంకాంగ్‌ నుంచే వచ్చే, ఆ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాలన్నీ రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. హాంకాంగ్‌ దేశంలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రొ-డెమోక్రసీ సభ్యులు గత కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఆ నిరసనల ప్రభావం ఆ దేశ షేర్‌ మార్కెట్‌పై పడి తీవ్ర నష్టాలను చవిచూసింది.

Related Tags