Alzheimer Disease: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే అల్జీమర్స్ బారిన పడే అవకాశం.. ఎందుకో తెలుసుకోండి

Alzheimer Disease Symptoms: ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని క్రమేపి కోల్పోవడాన్నే అల్జీమర్స్ అంటారు. ఈ వ్యాధి బాధితుల దైనందిన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో

Alzheimer Disease: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే అల్జీమర్స్ బారిన పడే అవకాశం.. ఎందుకో తెలుసుకోండి
Alzheimer Disease

Updated on: Mar 23, 2022 | 8:46 PM

Alzheimer Disease Symptoms: ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని క్రమేపి కోల్పోవడాన్నే అల్జీమర్స్ అంటారు. ఈ వ్యాధి బాధితుల దైనందిన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మానసిక ఒత్తిడి (mental stress), డిప్రెషన్ (depression) కారణంగా ఇప్పుడు యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చిన్నవయసులోనే జ్ఞాపకశక్తి తగ్గిపోయిందంటూ ఆసుపత్రులకు వచ్చే కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. దుర్భర జీవనశైలి, సోషల్ మీడియాకు అలవాటు పడి యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీంతోపాటు ఒత్తిడి కారణంగా వారి జ్ఞాపకశక్తి క్రమంగా బలహీనపడుతోందంటున్నారు.

వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. అల్జీమర్స్ వ్యాధి కారణంగా మెదడు కణజాలం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఇది వ్యక్తి మనస్సుపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల మనిషి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటాయి. అతనికి ఏమీ గుర్తుండదు. వృద్ధులలో ఈ సమస్య చాలా సాధారణం. మగవారిలో 60 ఏళ్లు, మహిళల్లో 50 ఏళ్లు దాటిన తర్వాత దీని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి. కానీ ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ న్యూరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా అల్జీమర్స్ వాధి గురించి మాట్లాడుతూ.. కేసులు నిరంతరం పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఎందుకంటే ఇది వయస్సు రిత్యా కనిపించే వ్యాధి అయినప్పటికీ.. ఈరోజుల్లో యువతలో మతిమరుపు లక్షణాలు ఎక్కువయ్యాయన్నారు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, మల్టీ టాస్కింగ్ కారణంగా ఇది జరుగుతోందన్నారు. మానసిక ఒత్తిడి కారణంగా యువత రోజువారీ విషయాలను మరిచిపోయి తమ పనులు సక్రమంగా చేసుకోలేకపోతున్నారని వివరించారు.

40 ఏళ్ల లోపు వయసులో కూడా ఈ సమస్య..

సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. అల్జీమర్స్ సమస్య సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుందన్నారు. ఈ వ్యాధికి నిర్దిష్ట కారణం లేదు. అయినప్పటికీ దీని లక్షణాలు పెరుగుతున్న వయస్సు, జన్యుపరమైన కారణాలు, తల గాయం, ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తాయతపతాకగ. అల్జీమర్స్‌కు చికిత్స లేదు. కానీ వ్యాధిని సకాలంలో గుర్తించడం ద్వారా లక్షణాలను తగ్గించవచ్చు.

డాక్టర్ చెబుతున్న దాని ప్రకారం.. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా జ్ఞాపకశక్తి బలహీనత గురించి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని రోజుల నాటి విషయాలను కూడా అంత తేలికగా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా విషయం వల్ల ఒత్తిడి, ఆందోళన లేదా డిప్రెషన్ ఉంటే.. అలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు

చిన్న చిన్న విషయాలు గుర్తుండకపోవడం.

సాధారణ పనులు చేయడం కష్టమవ్వడం

ప్రవర్తనలో మార్పు రావడం.

మాట్లాడేటప్పుడు మాటలు మర్చిపోవడం.

ఇటీవల చూసినదాన్ని కూడా మర్చిపోవడం.

Also Read:

Viral Photo: ఇది సంతకమేనా..? ఇలా చేయాలంటే ఎంత ఓపికుండాలో.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..

Viral Video: దేనికో మూడినట్టే..! రాబందుల అత్యవసర సమావేశం.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..