Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?

|

Apr 07, 2024 | 3:34 PM

గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ చాలా ముఖ్యం...

Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?
Health Tips
Follow us on

గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణ చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి శరీరంలోని ఏ భాగానైనా రావచ్చు. రక్తంలో క్యాన్సర్ వస్తే దానిని బ్లడ్ క్యాన్సర్ అంటారు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో బ్లడ్ క్యాన్సర్ కేసులు వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. గత దశాబ్దంలో బ్లడ్ క్యాన్సర్ కేసులు 20 శాతం పెరిగాయి.

బ్లడ్ క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో రక్తంలో కణాలు వేగంగా పెరగడం, వయసు పెరగడం, ఈబీవీ వైరస్‌, బెంజీన్‌కు గురికావడం ప్రధానమైనవి. బ్లడ్ క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, మైలోప్రొలిఫెరేటివ్ నియోప్లాజమ్ వివిధ రకాల రక్త క్యాన్సర్.

రక్త క్యాన్సర్ లక్షణాలు

ఇవి కూడా చదవండి
  • పదేపదే జ్వరం రావడం
  • చల్లని అనుభూతి
  • స్థిరమైన అలసట
  • బలహీనత
  • రాత్రి చెమటలు
  • కడుపు నొప్పి
  • తలనొప్పి
  • శ్వాసకోస ఇబ్బంది

లుకేమియా చికిత్స

మారింగో ఆసియా హాస్పిటల్‌లోని హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగంలో డాక్టర్ మీట్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశంలో బ్లడ్ క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. దాని చికిత్స కోసం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (BMT) కూడా చేస్తారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 2,500 నుండి 3,000 బీఎంటీలు చేస్తున్నారు. వీటి సంఖ్య పెరిగింది. కానీ నేటికీ భారతదేశంలో కేవలం 10% జనాభాకు మాత్రమే రక్త సంబంధిత వ్యాధుల లక్షణాలు, చికిత్స గురించి తెలుసు. రక్త రుగ్మతలు క్యాన్సర్ ప్రాణాంతక రూపాలలో ఒకటి. ఇది జీవిత నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా ఈ వ్యాధులను శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.

బీఎంటీ ఎలా జరుగుతుంది?

బీఎంటీతో అనేక రకాల సమస్యలు నయమవుతాయి. ఇది రక్త క్యాన్సర్, తలసేమియా, కొన్ని స్వయం ప్రతిరక్షక రుగ్మతలను కూడా నయం చేస్తుంది. ఇది కాకుండా బీఎంటీ మెదడు కణితులకు కూడా ఉపయోగించబడుతుంది. బీఎంటీ అవసరమయ్యే రోగులలో 6 నెలల వయస్సు నుండి ప్రతి నెలా రక్తమార్పిడి చేయించుకునే వారు ఉంటారు. ఇది కాకుండా, రక్తహీనత రోగులు, అలసట, నిరంతర జ్వరం లేదా శరీరంపై రక్తస్రావం మచ్చలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా బీఎంటీతో చికిత్స పొందవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి