
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకడం చాలా కష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. కానీ ఇలా ఫోన్ ను ఎక్కువగా వాడటం మన శరీరానికి, మనసుకు చాలా హానికరం. గంటల కొద్దీ వీడియోలు, సోషల్ మీడియా చూడటం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది.
2023లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ఒక పరిశోధన వచ్చింది. ఈ అధ్యయనంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న 655 మందిని పరిశీలించారు. ఫోన్ ఎక్కువగా వాడేవారు డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడం ఫోన్ ఎక్కువగా వాడటం వల్లే అని ఈ అధ్యయనం చెప్పింది.
సోషల్ మీడియాలో చెడు వార్తలు ఎక్కువగా చూడటం మానేసి.. పుస్తకాలు చదవండి, వాకింగ్ చేయండి లేదా కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపండి.