Coriander Water: దనియాల వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా చేసి చూడండి..!

|

Apr 02, 2022 | 12:48 PM

Coriander Water: కొన్ని వంటగదిలో దొరికి వస్తువులతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. చిన్న చిన్న టిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చని ఆయుర్వేద..

Coriander Water: దనియాల వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా చేసి చూడండి..!
Follow us on

Coriander Water: కొన్ని వంటగదిలో దొరికి వస్తువులతో ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. చిన్న చిన్న టిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వంటగదిలో ఉన్న ఔషధాల మేలు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అలాంటి దినుసుల్లో ధనియాలు ఒకటి. ధనియాలు (Dhania) ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉంటాయి. ధనియాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. నీటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగవచ్చు. దనియాల పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దనియాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ధనియాల నీరు ప్రయోజనాలు..

  1. ధనియాల నీటిని ప్రతిరోజూ ఉదయాన్నే తాగితే సులువుగా బరువు తగ్గవచ్చు. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.
  2. ఆర్థరైటిస్, శరీర నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎముకలకి బలాన్ని చేకూర్చి ఆరోగ్యంగా ఉంచడంలో ధనియాలు మేలు చేస్తాయి.
  3. శరీరంలో నీటిశాతాన్ని తగ్గకుండా చేస్తాయి. దీంతోపాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా అడ్డుకుంటాయి. నీరసం, బలహీనత నుంచి కూడా కాపాడుతాయి.
  4. కిడ్నీ, చర్మ, జట్టు సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. మూత్రపిండాలను పాడుచేసే మలినాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉంచుతాయి.
  5. ముఖం ఉబ్బుగా ఉన్నా.. శరీరంలో ఉబ్బుగా ఉన్నా దనియాల నీరు తాగితే తగ్గుతుంది. అందుకే వైద్య నిపుణులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా దనియాల నీటిని తాగాలని సూచిస్తున్నారు.
  6. నీటిలో దనియాలను వేసి మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు ధనియాల పౌడర్ కూడా వాడవచ్చు. అయితే.. ఉదయాన్నే పరిగడుపున ధనియాల నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Fish Benefits: మీరు చేపలను తరచూగా తింటున్నారా..? అద్భుతమైన ఫలితాలు ఇవే..!

Healthy Kidneys: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..? కిడ్నీ సమస్యలను గుర్తించడం ఎలా..?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరక ఉందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)