Milk Health Benefits: పాలలో ఎన్నో షోషకాలు ఉన్నాయి. అందుకే.. చిన్నా పెద్దా అందరరూ పాలు తాగడానికి ఇష్టపడతారు. రాత్రిపూట చాలా మంది ప్రజలు కచ్చితంగా పాలు తాగి నిద్రపోతారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి, ప్రొటీన్లు ఉంటాయి. అందుకే రోజూ కనీసం 1 గ్లాసు పాలు తాగమని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పాలు తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారడంతోపాటు ఆరోగ్యంగా ఉంటాయి. మనసు ఉల్లాసంగా, శరీరం దృఢంగా ఉండాలంటే పాలు తాగాలని పేర్కొంటారు. పాలలోని పోషకాలు మరింత పెరగాలంటే అందులో ఈ 3 పదార్థాలను మిక్స్ చేసి తాగాలని సూచిస్తున్నారు. దీంతో పాలలో పోషక విలువలు పెరుగుతాయి. ఇలా పాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బలపడి వ్యాధులకు దూరంగా ఉంటారు. పాలలో ఎలాంటి పదార్థాలు కలుపుకొని తాగాలో ఇప్పుడు తెలుసుకోండి..
బాదం పాలు: బాదంపప్పును పాలలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు బాదంపప్పు పొడిని పాలలో కలిపి ఇవ్వవచ్చు. బాదం పాలు తయారు చేయడానికి, 1 గ్లాసు పాలు తీసుకొని 5-6 బాదంపప్పులను మెత్తగా లేదా చిన్న ముక్కలుగా చేసి అందులో వేయండి. ఈ పాలను బాగా మరిగించి అందులో కొంచెం పంచదార వేసి చల్లారిన తర్వాత తాగాలి.
గోల్డెన్ మిల్క్: కరోనా నాటినుంచి అందరూ గోల్డెన్ మిల్క్ తాగమని సిఫార్సు చేస్తున్నారు. గోల్డెన్ పాలు అంటే పసుపు పాలు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. పసుపు పాలు రోజూ తాగడం వల్ల వ్యాధులు దూరమవుతాయి. దీని కోసం, 1 గ్లాసు పాలు, కొంచెం పసుపు పొడి కలిపి బాగా మరిగించాలి. అనంతరం గోరువెచ్చని పాలను తాగాలి.
దాల్చిన చెక్క పాలు: దాల్చిన చెక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఖచ్చితంగా దాల్చిన చెక్కను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికోసం 1 గ్లాసు పాలను మరిగించి, దాల్చిన చెక్క పొడి కలుపుకొని గోరువెచ్చగా తాగాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..