Cow Milk vs Buffalo Milk: పిల్లలకు ఆవు పాలు మంచివా.. గేదెపాలు మంచివా. రెండు పాలల్లో తేడాలు ఏమిటి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే

Cow Milk vs Buffalo Milk: పాలు శ్రేష్ఠమైన బలవర్ధక ఆహారము. అనేక పోషక విలువలు ఉన్నాయి. పాలను వయసు తో నిమిత్తం లేకుండా అన్ని రకాల వయసుల వారు తీసుకోదగిన ఉత్తమ ఆహారం. ఆవులు, గేదెలు, మేకలు,..

Cow Milk vs Buffalo Milk: పిల్లలకు ఆవు పాలు మంచివా.. గేదెపాలు మంచివా. రెండు పాలల్లో తేడాలు ఏమిటి.. ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటంటే
Cow Vs Buffelo

Updated on: Aug 24, 2021 | 12:20 PM

Cow Milk vs Buffalo Milk: పాలు శ్రేష్ఠమైన బలవర్ధక ఆహారము. అనేక పోషక విలువలు ఉన్నాయి. పాలను వయసు తో నిమిత్తం లేకుండా అన్ని రకాల వయసుల వారు తీసుకోదగిన ఉత్తమ ఆహారం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పాలను ఉత్పత్తి చేసే జంతువులు అయితే గాడిద పాలు కూడా తాగేవారు ఉన్నారు. ఇక ఆవు పాలు తాగడానికే కాదు.. పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాల్లో వాడతారు.  రోజువారీ జీవితంలో పాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఉదయం కాఫీ, టీ రూపంలో మొదలు పెట్టి.. రాత్రి పెరుగు, లేదా పాలతో ముగిస్తుంది.. అయితే చంటి పిల్లలకు తల్లిపాలు తర్వాత ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి అని అంటారు. దీంతో చాలామందిలో ఆవు పాలు మంచివా.. గేదెపాలు మంచివా ఈ రెండిటి తేడాలు ఏమిటి..? ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం..

ఆవు పాలు చాలా తేలిగ్గా ఉంటాయి.  సులభంగా జీర్ణమవుతాయి. అయితే గేదె పాలు కొంచెం చిక్కగా ఉండి అరగడానికి సమయం తీసుకుంటుంది.  ఈ రెండు పాలల్లో ప్రధాన తేడాలు ఏమిటంటే..

*ఆవు పాలు, గేదె పాలలో కొవ్వు శాతంలో చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా ఆవు పాలలో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆవు పాలు చాలా పల్చగా కనిపిస్తాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి.  గేదె పాలల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. గేదెపాలు తాగితే ఎక్కువ సేపు కడుపునిండిన ఫీలింగ్ ఉంటుంది

*ఆవు పాలలో కంటే గేదె పాలాల్లోనే ఎక్కువ ప్రొటీన్ల శాతం ఉంటుంది. గేదె పాలల్లో  ఎక్కువ ఫ్యాట్, ప్రొటీన్ ఉన్నాయి. అందుకనే  శారీరక శ్రమ చేయనివారితో పాటు, చిన్న పిల్లలు, ముసలి వారు గేదె పాలను తాగడం వలన జీర్ణం కాక ఇబ్బందులు పడతారు. అయితే శరీరానికి ప్రోటీన్లు ఎక్కువ అందిచాల్సినవారు గేదెపాలు తాగడం మంచిది. మిగిలిన వారికీ ఆవు పాలే శ్రేష్టం.

*ఇక ఆవు పాలల్లో నీటి శాతం అధికం అంటే సుమారు  87 శాతం కంటే ఎక్కువగా నీళ్లు ఉంటాయి. అందుకే వీటిని పల్చని నీళ్లలాంటి పాలు అని పిలుస్తారు. ఇందులో పాల సాలిడ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గేదె పాలలో నీటి శాతం తక్కువ.

* కొలెస్ట్రాల్ పరంగా చూస్తే ఆవు పాల కంటే గేదె పాలే ఆరోగ్యానికి మంచివి.. ఆవు పాలల్లో 3.14 mg/g కొలెస్ట్రాల్ ఉంటె.. అదే గేదే పాలల్లో మాత్రం కేవలం 0.65 mg/g మాత్రమే ఉంటుంది.  అందుకనే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారితో పాటు, బీపీ, కిడ్నీ సమస్యలు, పీసీఓడీ, గుండె జబ్బులతో బాధపడేవారు గేదె పాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచింది.

*ఆవు పాలల్లో పొటాషియం, సోడియంలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివి.

* ఆవు పాలు చాలా క్రీమీగా, చిక్కగా ఉంటాయి. అందుకే పెరుగు, పనీర్, ఖీర్ వంటివి చేయడానికి వీటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆవు పాలను సందేశ్, రసగుల్లా లాంటివి చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

* అయితే రాత్రి మంచి నిద్ర పోవాలంటే.. ఆవు పాలకంటే గేదెపాలు మంచివట. సుఖనిద్ర పోవాలంటే రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు గేదెపాలు తాగమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Tokyo Paralympics: నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్.. భారత్ పాల్గొనే ఈవెంట్స్ 27నుంచి స్టార్ట్