Snake Bite: పాము కాటేస్తే ఏం చేయాలి.. ఆపద సమయంలో ఇలా చేయండి..

|

Mar 02, 2022 | 10:38 PM

Snake Bite: పాము కాటుతో భారత్‌లో ఏటా 50 వేల మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే. పాము కాటుకు సరైన చికిత్స అందించినట్లయితే ఆ వ్యక్తి బతికిపోతాడు.

Snake Bite: పాము కాటేస్తే ఏం చేయాలి.. ఆపద సమయంలో ఇలా చేయండి..
Representative image
Follow us on

Snake Bite: పాము కాటుతో భారత్‌లో ఏటా 50 వేల మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే. పాము కాటుకు సరైన చికిత్స అందించినట్లయితే ఆ వ్యక్తి బతికిపోతాడు. పాము కాటుకు గురైన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ వ్యక్తి అయినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. పాముకాటుకి గురైతే ఆందోళన పడకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. ఒక పాము మిమ్మల్ని కానీ ఎవరినైనా కరిచినా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. లేదా అత్యవసర పరిస్థితికి కాల్ చేయాలి. బాధితులకి యాంటీవీనమ్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఔషధం పాము విషాన్ని బంధించడం, తీవ్రమైన రక్తం, నాడీ వ్యవస్థ సమస్యలను కలిగించకుండా నిరోధిస్తుంది. వీలైతే దూరం నుంచి పాము ఫొటో తీసుకోండి. దీనివల్ల పామును గుర్తించడం సులువవుతుంది. చికిత్స తొందరగా జరుగుతుంది.

పాము కాటు వల్ల చాలా మంది భయాందోళనలకు గురవుతారు. కానీ అలాంటి పరిస్థితిలో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. పాము కరిచిన భాగంలో వాపు ప్రారంభమైన వెంటనే మొదట రింగ్ లేదా వాచ్ వాటిని తీసివేయండి. పాము కాటు వేసిన ప్రదేశాన్ని సబ్బు, నీటితో కడగడానికి ప్రయత్నించండి. తర్వాత శుభ్రమైన క్లాత్‌తో ఆ ప్రాంతాన్ని కట్టి ఉంచండి. కరిచిన చోట మురికి క్లాత్‌ కట్టకూడదు. పాము కాటు తర్వాత లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకండి. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. కత్తితో గాయాన్ని ఎప్పుడూ కట్‌ చేయకూడదు. ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది. చాలా మంది పాము కాటు తర్వాత విషాన్ని పీల్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఎప్పటికీ చేయకూడదు.

రాత్రిపూట ఈ పండు తింటే ఆ ట్యాబ్లెట్‌ అవసరమే ఉండదు.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..

Coconut Water: కొబ్బరి బోండాతో ఆరోగ్యానికి అండ.. పోషక విలువలు తెలిస్తే అస్సలు వదలరు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో పాత పెన్షన్ ప్రయోజనాలు..!