Beauty Sleep: అమ్మాయిలు మీకోసమే.. హాయిగా.. ప్రశాంతంగా నిద్రపోతే మరింత అందం మీ సొంతం.. బ్యూటీ స్లీప్ ఇలా ట్రైచేయండి..

నిద్ర అనేది మనకి కనీస అవసరం. సగం పైన జీవితం మనం నిద్రలో ఉంటాం. 24 గంటల్లో 8 గంటలు నిద్రకి కేటాయిస్తాం. నిద్ర మనకి అంత అవసరం. సరిగా పనిచేస్తూ, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. అంతే కాదు మరింత అందంగా మెరిసిపోవాలంటే మాత్రం మంచి నిద్ర అవసం దానినే బ్యూటీ స్లీప్ అని కూడా అంటున్నారు. అసలు ఈ బ్యూటీ స్లీప్ అంటే ఏంటో తెలుసుకుందాం..

Beauty Sleep: అమ్మాయిలు మీకోసమే.. హాయిగా.. ప్రశాంతంగా నిద్రపోతే మరింత అందం మీ సొంతం.. బ్యూటీ స్లీప్ ఇలా ట్రైచేయండి..
Glowing Skin With Beauty Sleep

Updated on: Oct 31, 2022 | 9:49 AM

నిద్ర శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు, చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అవసరానుగుణంగా నిద్ర, నిశ్శబ్దం, విశ్రాంతి ఆరోగ్య రీత్యా మనకు తప్పనిసరి. నిశ్శబ్దం బంగారం లాంటిదని కోర్టు చాలా సార్లు వ్యాఖ్యానించింది. శరీరం, మనస్సు రెండింటికీ నిద్ర చాలా ముఖ్యం. హాయిగా నిద్రపోవాలని మీ ఇంట్లోనివారు ఈ విషయాన్ని చాలా సార్లు హెచ్చరిస్తుంటారు. కాకపోతే అందాన్ని పెంచుకోవడానికి ఆరోగ్యంతో పాటు నిద్ర కూడా అవసరం. ఎందుకంటే మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు, మనస్సు రిలాక్స్ అవుతుంది. శరీరం స్వయంగా రిపేర్ అవుతుంది. ఈ రిపేర్‌లో స్కిన్ రిపేర్ కూడా ఉంటుంది. దీనినే బ్యూటీ స్లీప్ అని కూడా అంటారు. నిద్ర మీ అందాన్ని మెరుపును ఎలా పెంచుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం.  

ఎన్ని గంటలు నిద్రపోవాలి

సాధారణంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం. వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది. ప్రతి వ్యక్తి రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తారు వైద్యులు. ఇది సాధారణంగా 18 నుంచి 58 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు చెప్పబడుతుంది. ఈ వయస్సుకి ముందు.. ఆ వయస్సు తర్వాత ఒక వ్యక్తికి మరికొన్ని గంటల నిద్ర అవసరం. ఇది శరీరం , వయస్సు, అవసరాన్ని బట్టి ఉంటుంది. కానీ మీ చర్మం సహజంగా మెరిసిపోవాల్సిన వయస్సులో మీ చర్మం సరైన నిద్రతో మెరుస్తూ ఉంటుంది.

బ్యూటీ స్లీప్ అంటే ఏంటి?

సమయానికి నిద్రపోవడం, ప్రతిరోజూ సమయానికి మేల్కొలపడంతోపాటు 8 గంటల నిద్రను పూర్తి చేయడం. నిద్రపోవాల్సిన  సమయంలో ప్రశాంతంగా.. డీప్ స్లీప్‌లోకి వెళ్లాలి. అలా నిద్రపోయాక నిద్ర లేవగానే మానసికంగా, శారీరకంగా తాజా అనుభూతి కలుగుతుంది. అందే “నీలాల కన్నులలో మెల మెల్లగా నిదుర రావమ్మ రావే నిండార రావే” అంటూ జోల పాటలు వింటూ కూడా మనం నిద్రపోవచ్చు.

అందం నిద్ర యొక్క ప్రయోజనాలు

  • మన శరీరంలోని కణాల మరమ్మత్తు నిద్రలో మాత్రమే జరుగుతుంది. వీటిలో చర్మ కణాలు కూడా ఉంటాయి. నిద్ర బాగా.. గాఢంగా ఉన్నప్పుడు చర్మ కణాల రిపేర్ కూడా బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల చర్మంలో మెరుపు పెరుగుతుంది. మనం మొహం మరింత అందంగా మారుతుంది. 
  • మెదడు రీ ఫ్రెష్ అవుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. ఇది డోపమైన్, సెరోటోనిన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా.. కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ముఖం ఆకర్షణీయంగా మారుతుంది.
  • మంచి నిద్ర, తగినంత నిద్ర పొందడం ద్వారా శరీరంలో వాపు, ఉబ్బరం సమస్య ఉండదు. అందువలన, puffiness కూడా రక్షించబడింది.
  • ముడతలు, మచ్చల సమస్య నుంచి దూరంగా ఉండటానికి నిద్ర నాణ్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..