World Asthma Day: ఆస్తమా అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీనిని పూర్తిగా నివారించలేమా?

ఆస్తమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య. భారతదేశంలో కూడా ఈ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఆస్తమా ఒక ప్రమాదకరమైన వ్యాధి. సకాలంలో నియంత్రించకపోతే మరణానికి కూడా దారి తీస్తుంది. చాలా సందర్భాలలో ప్రజలు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించరు. ప్రజలు దీనిని సాధారణ దగ్గు లేదా శ్వాస సమస్యగా విస్మరిస్తారు. దీని కారణంగా ఈ..

World Asthma Day: ఆస్తమా అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? దీనిని పూర్తిగా నివారించలేమా?
Asthma

Updated on: May 07, 2024 | 1:59 PM

ఆస్తమా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య. భారతదేశంలో కూడా ఈ వ్యాధి కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఆస్తమా ఒక ప్రమాదకరమైన వ్యాధి. సకాలంలో నియంత్రించకపోతే మరణానికి కూడా దారి తీస్తుంది. చాలా సందర్భాలలో ప్రజలు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించరు. ప్రజలు దీనిని సాధారణ దగ్గు లేదా శ్వాస సమస్యగా విస్మరిస్తారు. దీని కారణంగా ఈ వ్యాధి నిరంతరం పెరుగుతోంది. సమస్య తీవ్రంగా మారినప్పుడు, రోగులు చికిత్స కోసం వైద్యుని వద్దకు వెళతారు. కానీ ఆస్తమా అనేది శాశ్వత నివారణ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధిని మాత్రమే నియంత్రించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన తర్వాత అది ఎప్పటికీ తగ్గదు.

ఆస్తమా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది?

అయితే అస్తమా అంటే ఏమిటి? ఇది రావడానికి కారణాలు ఏమిటి? అలాగే శాశ్వత నివారణ ఎందుకు సాధ్యకాదో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఆస్తమా అనేది ఊపిరితిత్తుల వ్యాధి అని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లోని పెనాలజీ విభాగంలోని అనిమేష్‌ ఆర్య అన్నారు. ఇందులో శ్వాసనాళాలు వాపుకు గురై కుంచించుకుపోతాయి. దీని కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. శ్వాసనాళంలో శ్లేష్మం రావడం ప్రారంభమవుతుంది. సమస్య కొనసాగితే, అది ప్రాణాంతకం కూడా కావచ్చు. ఆస్తమా ఏ వయసులోనైనా రావచ్చు. కానీ పిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధితులగా మారుతారు. దేశంలో ఆస్తమా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యమే ఈ వ్యాధి కేసులు పెరగడానికి ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

లక్షణాలు ఏమిటి?

  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ఛాతీలో బిగుతుగా ఉన్న భావన
  • కఫంతో కూడిన దగ్గు
  • నిద్రలో ఛాతీలో గురక

ఈ వ్యాధికి కారణం ఏమిటి?

ధర్మశిల నారాయణ్ హాస్పిటల్‌లోని పల్మోనాలజీ అండ్ స్లీప్ మెడిసిన్ విభాగంలోని డాక్టర్‌ నవనీత్‌ సూద్‌ పలు విషయాలను వెల్లడించారు. ఆస్తమాకు అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం, అధిక ధూమపానం, ఏదైనా రకమైన శ్వాసకోశ సంక్రమణకు గురికావడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. అంటే మీ కుటుంబంలో ఎవరైనా ఇంతకు ముందు ఈ వ్యాధితో బాధపడి ఉంటే, మీరు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది.

ఆస్తమాకు శాశ్వత చికిత్స ఎందుకు లేదు?

పల్మోనాలజీ, స్లీప్ మెడిసిన్ విభాగంలో నారాయణ్ హాస్పిటల్, గురుగ్రామ్ డా.శ్వేతా బన్సాల్‌ మాట్లాడుతూ.. ఆస్తమాను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దానిని నియంత్రించడం మాత్రమే సాధ్యమవుతుందని వివరించారు. జన్యుపరమైన, పర్యావరణ కారణాల వల్ల ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. ఆస్తమాను పూర్తిగా నయం చేసే వైద్య చికిత్స లేదు. ఒక వ్యక్తిలో ఆస్తమా దాడి అతని రోగనిరోధక వ్యవస్థ వల్ల కూడా వస్తుంది. ఈ రకమైన సమస్యకు శాశ్వత చికిత్స కష్టం అవుతుంది. అందుకే ఆస్తమాకు మందు లేదు. అయితే ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. మంచి జీవనశైలి, మంచి ఆహారం, ఇన్‌హేలర్ వాడకం ద్వారా ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చు.

ఆస్తమాను ఎలా నివారించాలి?

ఈ వ్యాధి నివారణ కూడా ముఖ్యం. దీని కోసం, మీరు మీ చుట్టూ పరిశుభ్రతను కాపాడుకోవాలి. దుమ్ము, బురద, పొగ నుండి రక్షణ చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా యోగా చేయండి. ఎక్కువ నూనె తీసుకోవడం మానుకోండి. ధూమపానం చేయవద్దు. మురికి ప్రదేశాలలో బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.

పూర్తి చికిత్స అవసరం

ఆస్తమాకు శాశ్వత నివారణ లేదని, అయితే తప్పనిసరిగా మందుల కోర్సు పూర్తి చేయాలని ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్ డాక్టర్‌ అంకిత్‌కుమార్‌ చెప్పారు. ఈ వ్యాధి సంభవించినట్లయితే మందుల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా వేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో ప్రజలు ఆస్తమాను నియంత్రించడానికి మందులు తీసుకుంటారు. కానీ కొంత ఉపశమనం పొందిన తర్వాత చికిత్సను ఆపివేస్తారు. ఎందుకంటే ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేదు. అటువంటి పరిస్థితిలో ఆస్తమా దాడి మళ్లీ సంభవిస్తుంది. వ్యాధిని నియంత్రించడానికి ప్రజలు మందుల కోర్సును మధ్యలోనే వదిలివేయవద్దని సూచించారు.

(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి