CBC పరీక్ష అంటే ఏమిటి? .. ఇంతకు దీనిని ఎందుకు చేస్తారో తెలుసా?

మనం ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు వైద్యులు మనకు CBC టెస్ట్‌ చేయాలని చూసిస్తారు. అసలు ఈ CBC టెస్ట్‌ ఏమిటి.. ఇంతకు దీన్ని ఎందుకు చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇది నార్మల్‌ బ్లడ్‌ టెస్ట్ మాత్రమే కాదని.. ఈ టెస్ట్ చేయడం వల్ల మన శరీరంలోని చాలా వాధ్యులను గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

CBC పరీక్ష అంటే ఏమిటి? .. ఇంతకు దీనిని ఎందుకు చేస్తారో తెలుసా?
Cbe Blood Test

Updated on: Aug 12, 2025 | 5:28 PM

CBC పరీక్ష అంటే ఏమిటి: మనం ఏదైనా అనారోగ్య సమస్య బారిన పడినప్పుడు డాక్టర్ వద్దకు వెళితే.. డాక్టర్‌ మనకు CBC టెస్ట్‌ ఒక పరీక్షను సూచిస్తాడు. CBC పరీక్ష (కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్). చాలా మంది దీనిని కేవలం రక్త పరీక్ష అని అనుకుంటారు. కానీ ఈ ఒక్క పరీక్షతో మన శరీంలోని అనేక వ్యాధుల గురించి తెలసుకోవచ్చట. ఢిల్లీ వైద్యుల ప్రకారం.. మన రక్తంలో చాలా ముఖ్యమైన భాగాలు ఉంటాయి. వీటిలో ఎర్ర రక్త కణాలు (RBC), తెల్ల రక్త కణాలు (WBC), హిమోగ్లోబిన్, ప్లేట్‌లెట్లు ఉన్నాయి. ఈ కణాలన్నీ ఎముక మజ్జలో (ఎముకల లోపల స్పాంజి కణజాలం) ఏర్పడతాయి. CBC పరీక్ష ప్రధానంగా వాటి గురించి వెల్లడిస్తుంది. వాటి స్థాయి సాధారణం కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.

ముందుగా, RBC గురించి మాట్లాడుకుంటే ఇది మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను అందించడం చేస్తుంది. ఒక వేళ మన శరీరంలో RBC కౌంట్‌ తగ్గితే, అది రక్తహీనతకు కారణమవుతుంది.ఒక వేళ RBC పెరిగితే, అది రక్తాన్ని చిక్కగా చేస్తుంది దీంతో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. RBC లోపల హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది తగ్గుతే మనకు అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

ఇక WBC విషయానికొస్తే.. తెల్ల రక్త కణాలు మన శరీరానికి సైనికులు వంటివి. ఇవి వైరస్‌లు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా శరీరంపై దాడి చేసే ఇతర ఇన్ఫెక్షన్‌లతో పోరాడి మన శరీరాన్ని కాపాడుతాయి. ఇందులో ఇసినోఫిల్, బాసోఫిల్, న్యూట్రోఫిల్, లింఫోసైట్, మోనోసైట్ వంటి అనేక రకాలు ఉంటాయి. ఒకరి శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతున్నట్లయితే, అది క్యాన్సర్‌కు సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని సూచిస్తుంది. అదే WBC సంఖ్య తగ్గుతుంటే అది మన రోగనిరోదక శక్తిని తగ్గిస్తుంది. దీంతో మన శరీరం ఇన్ఫెక్షన్‌లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

మీరు CBC పరీక్ష ఎందుకు చేయించుకోవాలి?

మీకు తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తే. ఏవైనా గాయాలు అయినప్పుడు అవి తొందరగా తగ్గకపోయినా.. మీరు వైద్యుల సలహాలో ఈ టెస్ట్‌ను చేయించుకోవచ్చు. దీంతో మీ సమస్యకు కారణం తెలుస్తుంది. దీంతో మీరు వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోచ్చు.ఈ పరీక్ష కూడా చేయడం కూడా చాలా సులభం. ఈ టెస్ట్‌ కోసం ఒక చిన్న రక్త నమూనా మాత్రమే తీసుకుంటారు. కొన్ని గంటల్లో రిపోర్ట్‌ కూడా వస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు నివేదికలు, నిపుణులు, ఇంటర్‌నెట్‌ నుంచి సేకరించిన వివారాల ద్వారా అందజేయడమైనది. కావున ఈ అంశాలపై మీకు ఎలాంటి సందేహాలు ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్, లేదా ఇతర వైద్యులను సంప్రదించండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.